IPL 2024 GT vs PBKS : ఐపీఎల్ 17వ సీజన్ 17వ మ్యాచ్ అహ్మాదాబాద్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), పంజాబ్ కింగ్స్(Punjab Kings) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఒక మార్పుతో ఆడుతోంది. గాయపడిన మిల్లర్ స్థానంలో కేన్ విలియమ్సన్ జట్టులోకి వచ్చాడు. పంజాగ్ జట్టులో లివింగ్‌స్టోన్ స్థానంలో సికిందర్ రజా ఆడుతున్నాడు.
పంజాబ్ జట్టు : శిఖర్ ధావన్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), ప్రభ్సిమ్రాన్ సింగ్, సామ్ కరన్, శశాంక్ సింగ్, సికిందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, రబాడ, హర్షల్ పటేల్.
గుజరాత్ జట్టు : వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఓమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, దర్శన్ నల్కందే.