టోక్యో: ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీకి మరికొద్ది గంటలే ఉన్న సమయంలోనూ అక్కడి మెట్రోపాలిటన్ గవర్నమెంట్ బిల్డింగ్ దగ్గర నిరసనకారులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఒలింపిక్స్‌ను రద్దు చేయాల్సిందే అని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. సెర్మనీ ప్రారంభమైన తర్వాత కూడా స్టేడియానికి సాధ్యమైనంత దగ్గరగా తమ నిరసనలను కొనసాగిస్తామని వాళ్లు స్పష్టం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఒలింపిక్ టార్చ్ ఆ భవనం దగ్గరికి వచ్చిన సమయంలో నిరసనకారులు అక్కడే ఉన్నారు.
ఇవాళ ఓపెనింగ్ సెర్మనీ జరగబోతోంది. కానీ మేము గేమ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒలింపిక్స్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన. ఒలింపిక్ టార్చ్ ఇక్కడికి వస్తున్న సమయంలో నిరసన తెలుపుతున్నాం అని ఓ ఆందోళనకారుడు చెప్పింది. ఒలింపిక్ స్టేడియం దగ్గర కూడా తాము నిరసన తెలుపుతామని ఆమె స్పష్టం చేసింది. నిజానికి గేమ్స్‌ను రద్దు చేయాలంటూ జపాన్ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.