Priyank Panchal : దేశవాళీ క్రికెట్లో మరో క్రికెటర్ శకం ముగిసింది. విధ్వంసక ఆటగాడిగా పేరొందిన గుజరాత్ మాజీ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (Priyank Panchal) వీడ్కోలు పలికాడు. భారత ఏ జట్టుకు సైతం సారథిగా వ్యవహరించిన ప్రియాంక్.. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నానని వెల్లడించాడు. ఈ విషయాన్ని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సోమవారం అధికారికంగా తెలిపింది. 35 ఏళ్ల ప్రియాంక్ గుజరాత్ క్రికెట్‌కు విశేష సేవలు అందించాడు. 17 ఏళ్ల పాటు నిలకడగా రాణించాడని అతడిని కొనియాడింది జీసీఏ.
‘కుడిచేతి వాటం బ్యాటర్ అయిన ప్రియాంక్ ఇండియా ఏ కెప్టెన్‌గానూ రాణించాడు. అతడు ఒక రన్ మెషిన్. 17 ఏళ్లు అతడు దేశవళీలో గుజరాత్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సారథిగానూ తన ముద్రవేశాడు. అద్భుతమైన కెరీర్ సాగించిన ప్రియాంక్‌కు మా అసోసియేషన్ తరఫున అభినందనలు. మే 26న ఈ డాషింగ్ బ్యాటర్ అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు’ అని గుజరాత్ క్రికెట్ అసోషియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
Over and out. Onto greener pastures now. 🙌 pic.twitter.com/5uMiZVprql
— Priyank Panchal (@PKpanchal09) May 26, 2025
ఓపెనింగ్ బ్యాటర్ అయిన ప్రియాంక్ 2021లో టీమిండియాకు ఎంపికయ్యాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌కు ఓపెనర్ రోహిత్ శర్మకు ప్రత్యామ్నాయంగా అతడిని జట్టులోకి తీసుకున్నారు సెలెక్టర్లు. బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి రిజర్వ్ ఓపెనర్‌గా ప్రియాంక్‌ను ఎంపికయ్యాడు. అయితే.. తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ప్రియాంక్ తన సుదీర్ఘ కెరీర్లో 127 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 2016-17 రంజీ సీజన్లో అతడు ప్రత్యర్థులకు తన ఉగ్రరూపం చూపించాడనుకో.
End of an Era!
Gujarat Cricket Association congratulates Priyank Panchal on a stellar cricketing journey as he announces retirement from all formats on May 26, 2025.
A prolific right-handed opener, Priyank scored 8856 First-Class runs with 29 centuries & 34 fifties, including a… pic.twitter.com/O3iFec6xmS
— Gujarat Cricket Association (Official) (@GCAMotera) May 26, 2025
ఆ సీజన్లో రెచ్చిపోయి ఆడిన ఈ రైట్ హ్యాండర్ అజేయ త్రిపుల్ సెంచరీ(314 నాటౌట్)తో గర్జించాడు. భీకర ఫామ్‌లో ఉన్న అతడు ఆ ఎడిషన్‌లో ఏకంగా 1,310 రన్స్ కొట్టాడు. అతడి మెరుపులతో గుజరాత్ ఆ సీజన్లో విజేతగా నిలిచింది. 2012-13లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు 2015-16లో విజయ్ హజారే ట్రోపీ గెలుపొందిన జట్టులో కూడా ప్రియాంక్ సభ్యుడు. ఆసాంతం దంచికొట్టడమే మంత్రగా ఆడిన ఈ చిచ్చరపిడుగు డొమెస్టిక్‌లో 29 సెంచరీలు, 34 అర్ధ శతకాలు బాదేశాడు. 97 లిస్ట్ ఏ మ్యాచుల్లో 8 సెంచరీలతో కలిపి 3,672 రన్స్ కొట్టాడు. 59 టీ20లు ఆడిన ప్రియాంక్ 28.71 సగటుతో 1,522 పరుగులు సాధించాడు. దాంతో,