Banyan Tree | పూర్వ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఏదో ఒక భారీ వృక్షం కనిపిస్తూనే ఉండేది. ముఖ్యంగా మర్రి చెట్లు మనకు ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. చూద్దామంటే అసలు ఈ చెట్లు కనిపించడం లేదు. అయితే మర్రి చెట్టు మనక నీడను మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఆయుర్వేదంలో మర్రి చెట్టుకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. మర్రి చెట్టుకు చెందిన అన్ని భాగాలు మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయి. మర్రి మెరడు, ఆకులు, వేళ్లు, ఊడలు అన్నీ మనకు ఉపయోగపడేవే. ఈ క్రమంలోనే ఆయా భాగాలతో అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.
మర్రి చెట్టు ఆకులు, బెరడులో యాస్ట్రింజెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ ఆకులు లేదా బెరడను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగుతుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే వాపులు తగ్గిపోతాయి. మర్రి చెట్టు ఆకులను ఉపయోగించడం వల్ల పేగుల్లో మలం సులభంగా కదులుతుంది. మలబద్దకం తగ్గుతుంది. పొట్టలో అసౌకర్యంగా ఉన్నవారు కూడా మర్రి చెట్టు ఆకులను తీసుకుని వాటితో కషాయం తయారు చేసి తాగుతుంటే ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. షుగర్ ఉన్నవారికి మర్రి చెట్టును వరంగా చెప్పవచ్చు. మర్రి చెట్టు బెరడు ఇందుకు చక్కగా పనిచేస్తుంది. దీంట్లో హైపో గ్లైసీమిక్ గుణాలు ఉంటాయి. అంటే ఇది షుగర్ లెవల్స్‌ను గణనీయంగా తగ్గిస్తుందన్నమాట. మర్రి బెరడును నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను సేవిస్తుంటే డయాబెటిస్ తగ్గుతుంది. మర్రి బెరడులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను కణాలు సరిగ్గా శోషించుకునేందుకు పనిచేస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గి డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
మర్రి చెట్టు ఆకులను నేరుగా అలాగే నమిలి కాసేపు అయ్యాక ఉమ్మేయాలి. ఇలా చేస్తుంటే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గిపోతుంది. ముఖ్యంగా పుచ్చిపోయిన దంతాలు ఉన్నవారు, చిగుళ్ల నుంచి రక్తం కారుతున్న వారు ఈ చిట్కాను పాటిస్తే ఫలితం ఉంటుంది. నోట్లో ఉండే పొక్కులు, పుండ్లను తగ్గించడంలోనూ మర్రి ఆకులు, బెరడు ఎంతగానో ఉపయోగపడతాయి. మర్రి బెరడులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. మర్రి బెరడును కాస్త పొడి చేసి అందులో కొద్దిగా నీళ్లను పోసి మెత్తని పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పూట ఆర్థరైటిస్ నొప్పులు ఉన్న చోట రాయాలి. ఇలా రోజూ చేస్తుంటే కొన్ని రోజులకు ఆర్థరైటిస్ నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే శరీరంలో ఇతర చోట్లలో ఉండే నొప్పులు కూడా తగ్గిపోతాయి.
మర్రి ఆకుల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ ఆకులు అనేక చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ముఖ్యంగా తామర, గజ్జి, ఇతర చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. మర్రి ఆకుల పేస్ట్ లేదా బెరడు పొడి, నీటి మిశ్రమాన్ని రాస్తుంటే గాయాలు, పుండ్లు త్వరగా మానిపోతాయి. సూర్య కాంతి వల్ల చర్మం కందిపోయినా కూడా మర్రి ఆకుల మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. అలాగే మర్రి ఆకుల పేస్ట్‌లో కొద్దిగా చల్లని పాలను కలిపి ఈ మిశ్రమాన్ని రాస్తుంటే మొటిమలు, చర్మంపై ఉండే దురదలు, దద్దుర్లు తగ్గిపోతాయి. ఇలా మర్రి చెట్టు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. దీని లాభాలను అసలు మరిచిపోకండి.