గరిడేపల్లి, మే 26 : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని రాయినిగూడెం ప్రాథమిక సహకార సంఘంలో అవినీతికి పాల్పడిన పీఏసీఎస్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ పార్టీల నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వెలిదండ సంఘం గోదాం చుట్టూ గోడ కట్టకుండానే బిల్లులు రూ.6,65,504/- సంఘం కార్యాలయం తీర్మాణం లేకుండా అక్రమంగా డ్రా చేసినట్లు ఆరోపించారు.
సంఘం గోదాంలో కిరాయి అగ్రిమెంట్లో తేడాలు ఉన్నాయని, వెంటనే డీసీఓ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. నిరసన తెలిపిన వారిలో బీఆర్ఎస్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు పోటు లక్ష్మయ్య, పెండెం వీరాస్వామి, నాయకులు మేకల కనకారావు, డి.బాలకృష్ణయ్య, రాపోలు నవీన్, కామళ్ల నవీన్, గడ్డం అనిల్, మాశెట్టి అంజయ్య, బాదె నర్సయ్య, గుండి వెంకటేశ్వర్లు, ఆంథోని, ప్రసాద్, అంజయ్య, రవి, కందుల జానయ్య, పెండెం రాజాలు, బాలరాజు, వీరాంజనేయులు ఉన్నారు.
Garidepalli : అవినీతి పీఏసీఎస్ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని ధర్నా