Paris Olympics : భారత సీనియర్ ట్రాప్ షూటర్ పృథ్వీరాజ్ తొడైమన్(Prithviraj Todaiman) ప్యారిస్ ఒలింపిక్స్ స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు. షాట్ గన్స్ కేటగిరీలో అతడు విశ్వ క్రీడల్లో పోటీ పడనున్నాడు. బుధవారం నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) ఆరుగురితో కూడిన షాట్ గన్ బృందాన్ని ప్రకటింటింది. ఇటలీలో ఐఎస్ఎస్ఎఫ్ (ISSF) షాట్ గన్ వరల్డ్ కప్ ముగిశాక జాతీయ సెలెక్షన్ కమిటీని ఎన్ఆర్ఏఐ సంప్రదించింది. అనంతరం అర్హులైన షూటర్ల పేర్లను వెల్లడించింది.
పురుషుల ట్రాప్ విభాగంలో పృథ్వీ రాజ్ సెలెక్ట్ కాగా.. మహిళల విభాగంలో రాజేశ్వరి కుమారి (Rajeshwari Kumari) చోటు దక్కించుకుంది. పురుషుల స్కీట్‌లో అనన్జిత్ సింగ్ నరుకా.. మహిళల నుంచి మహేశ్వరి చౌహన్, రైజా ధిల్లాన్‌లు అర్హత సాధించారు. మిక్స్డ్ టీమ్‌లో అనన్జిత్ సింగ్ నరుకా, మహేశ్వరి చౌహన్లు పోటీ పడనున్నారు.
Indian Shotgun Squad for 2024 Paris Olympics:
Prithviraj Tondaiman trumps quota winner Bhowneesh Mendiratta in trap men’s.
Rajeshwari Kumari is the other trap shooter while Maheswari, Razia and Anantjeet Singh complete the skeet squad.#Shooting #IndianShooting #Paris2024 pic.twitter.com/aULYyvb2U6
— Pritish Raj (@befikramusafir) June 18, 2024