అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ (Advocate General) గా దమ్మాలపాటి శ్రీనివాస్(Dammalapati Srinivas ) ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి నియామక ఉత్తర్వులను విడుదల చేసింది. 2014-2019 మధ్యకాలంలో కూడా దమ్మాలపాటి శ్రీనివాస్ ఏపీ అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు.
జగన్(Jagan) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన మీద కక్షగట్టిన జగన్ ఆయన్ని అనేకరకాలుగా వేధించారు. అనేక కేసులు పెట్టారు. రాజధాని భూముల కేసులో దమ్మాలపాటిని జైలుకు పంపే ప్రయత్నం కూడా చేశారు. చంద్రబాబు నాయుడి(Chandra Babu) ని స్కిల్ డెవలప్మెంట్(Skill development) కేసులో జగన్ ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు, ఆయన తరఫున దమ్మాలపాటి వాదించారు.