ముంబై : త్వరలో మొదలుకానున్న రంజీ సీజన్‌కు ముందు ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన పృథ్వీ షా.. వార్మప్ మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. మహారాష్ట్ర, ముంబై మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో షా.. 140 బంతుల్లో శతకం చేశాడు.
ఓపెనర్ అర్షిన్ కులకర్ణితో కలిసి తొలి వికెట్‌కు అతడు 305 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. ఈనెల 15 నుంచి మహారాష్ట్ర.. కేరళతో తమ తొలి రంజీ మ్యాచ్ ఆడనుంది.