Prithvi Shaw : రంజీ జట్టులో చోటు కోల్పోయిన యువ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) 25వ వసంతంలో అడుగు పెట్టాడు. శనివారం అతడి పుట్టిన రోజు సందర్భంగా సెలెక్టర్లు తీపి కబురు చెప్పారు. బర్త్ డే గిఫ్ట్‌గా మళ్లీ అతడిని ముంబై జట్టులోకి తీసుకున్నారు. అవును.. క్రమశిక్షణారాహిత్యం, ఫిట్నెస్ లేమి కారణంగా షాపై వేటు వేసిన సెలెక్టర్లు వారం రోజుల వ్యవధిలోనే మనసు మార్చుకున్నారు. దాంతో, అతడికి మరోసారి ముంబై తరఫున ఆడే అవకాశం లభించింది. టీ20 ఫార్మాట్లో జరుగనున్న సయ్యద్ ముస్తాక్ అలీ (Syed Mushtaq Ali) ట్రోఫీకోసం సెలెక్టర్లు 28 మంది బృందంలో షాకు చోటు దక్కింది.
పొట్టి ఫార్మాట్ స్పెషలిస్ట్ పృథ్వీ షాపై సెలెక్టర్లు మరోసారి నమ్మకం ఉంచారు. ఓపెనర్‌గా చెలరేగి ఆడే అతడికి ఐపీఎల్ మెగా వేలం ముందు సయ్యద్ ముస్తాక్ అలీ రూపంలో అవకాశం దొరికింది. దాంతో, తన ఫామ్ చాటుకొని ఐపీఎల్ వేలంలో భారీ ధర పలకాలని షా భావిస్తున్నాడు. ముంబై క్రికెట్ సంఘం సెలెక్షన్ ప్యానెల్‌లోని సంజయ్ పాటిల్ బృందం సయ్యద్ ముస్తాక్ అలీకోసం స్క్వాడ్‌ను ఎంపిక చేసింది.
Here’s wishing our U19 World Cup-winning captain a very happy 25th birthday! 👏💯#MCA #Mumbai #Cricket #Wankhede #BCCI | @PrithviShaw pic.twitter.com/mXlkMoBkqF
— Mumbai Cricket Association (MCA) (@MumbaiCricAssoc) November 9, 2024
అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు అవకాశమిస్తూ.. 28 మందితో బలమైన స్క్వాడ్‌ను సెలెక్ట్ చేసింది. ఈ స్క్వాడ్‌లో సీనియర్లు అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్, శార్థూల్ ఠాకూర్లు ఉన్నారు. వికెట్ కీపర్లుగా హార్దిక్ తమ్రే, ఆకాశ్ ఆనంద్‌లు ఎంపికయ్యారు. నవంబర్ 23వ తేదీ నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరుగనుంది.
ముంబై స్క్వాడ్ : పృథ్వీ షా, అయుశ్ హత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జై బిస్తా, శ్రీరాజ్ ఘరాత్, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్, సూర్యాన్ష్ షెడ్గే, ఇషాన్ ముల్చందని, సిద్దేశ్ లాడ్, హార్దిక్ తమ్రే(వికెట్ కీపర్), ఆకాశ్ ఆనంద్(వికెట్ కీపర్), సాయిరాజ్ పాటిల్, ఆకాశ్ పర్కార్, షామ్స్ ములానీ, హిమాన్షు సింగ్, సాగర్ ఛబ్రియా, శార్థూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, సిల్వెస్టర్ డిసౌజా, రోస్టన్ డియాస్, యోగేశ్ పాటిల్, హర్ష తన్నా, ఇర్ఫాన్ ఉమైర్, వినాయక్ భొయిర్, కృతిక్ హనగవడి, శశాంక్ అత్తర్డే, జునెద్ ఖాన్.
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) వదిలేసిన బాధ నుంచి తేరుకోకముందే పృథ్వీ షాకు ముంబై సెలెక్టర్లు పెద్ద షాచిచ్చారు. ఫామ్‌తో పాటు క్రమశిక్షణలోనూ విఫలమైన అతడిపై వేటు వేస్తూ రంజీ స్క్వాడ్ నుంచి తప్పించారు. దాంతో, భారత జట్టుకు మళ్లీ ఆడే అవకాశాలు చేజారుతున్న వేళ పృథ్వీకి ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ అయిన చాపెల్ ఓ లేఖ రాశాడు.
Former Australian legend Greg Chappell pens a heartfelt letter to under-firing Prithvi Shaw. pic.twitter.com/KMfRFTmFYD
— CricTracker (@Cricketracker) November 7, 2024
ప్రతి క్రీడాకారుడి జీవితంలో ఎత్తు పల్లాలు అనేవి కచ్చింతగా ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకో. క్రికెట్ లెజెండ్స్‌లో ఒకడైన డాన్ బ్రాడ్‌మన్‌కు కూడా ఇలాంటి పరిస్థితి తప్పలేదు. అతడు కూడా కొన్నిసార్లు జట్టులో చోటు కోల్పోయాడు. అనంతరం సత్తా చాటి మళ్లీ జట్టులోకి వచ్చాడు. గతం అనేది నిన్ను వర్ణించలేదు. పృథ్వీ.. ఈ విషయాలు మర్చిపోవద్దు. ఇకపై ఆటపై బాగా దృష్టి పెట్టు. ఏమైనా సలహాలు కావాల్సి వస్తే మొహమాటం లేకుండా నన్ను సంప్రదించు’ అని చాపెల్ ఆ లేఖలో రాసుకొచ్చాడు.