Game Changer Teaser | రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ టీజర్ రిలీజ్
Game Changer | మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
Game Changer | మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ‘గేమ్ ఛేంజర్ టీజర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు తీపికబురునందిస్తూ.. టీజర్‌ను విడుదల చేశారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ – శంకర్ – దిల్ రాజు ట్రయోలో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ చేసిన టీం తాజాగా టీజర్ కోసం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. ఇక ఈ వేడుకలో రామ్ చరణ్‌తో పాటు కియార అద్వానీ, దిల్ రాజు ఫ్యామిలీ, తదితరులు హాజరై సందడి చేశారు.
బేసిక్‌గా రామ్ అంతా మంచోడు లేడు. కానీ వాడికి కోపం వస్తే.. వాడి అంతా చెడ్డోడు ఇంకొకడు ఉండడు అంటూ మాస్ డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఇక గేమ్ ఛేంజర్ టీజర్ చూస్తుంటే.. రామ్ చరణ్ ఇందులో స్టూడెంట్‌గా, ప్రజల నేతగా, ఆఫీసర్‌గా రాజకీయ నాయకుడిగా నాలుగు పాత్రల్లలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా.. ఫస్ట్ టైం రామ్ చరణ్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తున్నాడు. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా సాగిన ఈ ట్రైలర్‌ను మీరు చూసేయండి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

