Priayansh Arya : పొట్టి క్రికెట్లో మరో సంచలనం. భారత లెజెండ్ యువరాజ్ సింగ్(Yuraj Singh) ఆరు సిక్సర్ల ఫీట్‌ను ఓ యువ క్రికెటర్ రిపీట్ చేశాడు. యువకెరటం ప్రియాన్ష్ ఆర్యా(Priayansh Arya) ఒకే ఓవర్లో ఆరు సార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. అంతేకాదండోయ్.. మెరుపు శతకంతో చెలరేగాడు. 50 బంతుల్లోనే 10 ఫోర్లు, 10 సిక్సర్లతో సెంచరీ బాదేశాడు. తద్వారా ఐపీఎల్(IPL) మెగా వేలానికి ముందు ఈ యంగ్‌స్టర్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు.
ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ప్రియాన్ష్ ఆకాశమే హద్దుగా ఆడాడు. నార్త్ ఢిల్లీ స్ట్రయికర్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 50 బంతుల్లోనే 120 రన్స్ కొట్టాడు. ప్రియన్ష్కు జతగా మరో శతక వీరుడు ఆయుష్ బదోని(165) సైతం బౌండరీల మోత మోగించాడు.
HISTORY BY PRIYANSH ARYA. 🤯🔥
– Priyansh has hit 6 sixes in a single over in Delhi T20 league, A player to watch out in SMAT & IPL auction.pic.twitter.com/oe3VMsZ9t6
— Johns. (@CricCrazyJohns) August 31, 2024
అతడైతే 8 ఫోర్లు, 19 సిక్సర్లతో స్ట్రయికర్స్ బౌలర్లను చీల్చిచెండాడు. వీళ్లిద్దరి విధ్వంసంతో దక్షిణ ఢిల్లీ జట్టు ఏకంగా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 308 రన్స్ కొట్టింది. అనంతరం ఛేదనలో స్ట్రయికర్స్ జట్టు 196 రన్స్‌కే పరిమితమైంది. దాంతో, దక్షిణ ఢిల్లీ 112 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.