Saripodhaa Sanivaaram | నాని కథానాయకుడిగా వచ్చిన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా.. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. తమిళ నటుడు ఎస్జే సూర్య కీలక పాత్రలో నటించాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్‌ను తాజాగా నిర్వహించారు మేకర్స్.
ఈ సక్సెస్ మీట్లో టైర్1, టైర్2 ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నాని. ‘సరిపోదా శనివారం’ హిట్ అయిన సందర్భంగా.. ఒక రిపోర్టర్ నానిని అడుగుతూ.. నాని గారు ఈ సినిమా హిట్ అవ్వడంతో మీరు టైర్ 2 నుంచి టైర్ 1 లోకి వచ్చాడు అంటున్నారు. దీనిపై ఏం అంటారు అనగా.?
నాని సమాధానమిస్తూ.. టైర్1, టైర్2లు అంటూ పేర్లు పెట్టకండి సర్. మీకు దండం పెడతాను ఈ టైర్1, టైర్2 గోల నుంచి నన్ను వదిలేయండి. ఇలాంటివి ఎవరు మొదలుపెట్టారో తెలిదు. ఎందుకు మొదలు పెట్టారో తెలిదు. నాకు సంబంధం లేని వాటి గురించి నన్ను ప్రశ్నలు అడిగితే నేను సమాధానం ఎలా చెప్పగలుగుతాను. ఇలాంటివి మీరు క్రియేట్ చేశారు. అది అలానే ముందుకు పోతుంది. నన్ను వదిలేయండి ఈ గోల నుంచి అంటూ నాని చెప్పుకోచ్చాడు.
ఇదే విషయంపై దర్శకుడు వివేక్ మాట్లాడుతూ.. నేను నానితో రెండు సినిమాలు చేశాను. నాని ఫ్యాన్స్ గురించి నాకు ఒక అంచనా ఉంది. నార్మల్‌గా ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదా. నానికి ఇంకా ఎక్కువ ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి. ఆయన సినిమాలలో ఒక్కో సినిమాకు ఒక్కో రకం ఫ్యాన్స్ ఉన్నారు. పిల్ల జమీందార్ సినిమాకు ఒక టైప్ ఫ్యాన్స్ ఉంటే.. జెర్సీ సినిమాకు ఒక రకం ఫ్యాన్స్ ఉంటారు. అలాగే శ్యాం సింగరాయ్‌కి ఒక రకం ఇలా నాని సినిమాలకే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. నానిని ఇలా టైర్ 1, టైర్ 2 అంటూ రెస్ట్రిక్ చేయడం ఆపేస్తే ఇంకా ముందుకు వెళతాడు అంటూ వివేక్ చెప్పుకోచ్చాడు.
Who introduced these Tier 1 or 2 or 3? pic.twitter.com/njcYg45IEM
— Aakashavaani (@TheAakashavaani) August 31, 2024
Also Read..