Rohit Sharma : వచ్చే వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా చెలరేగుతున్న మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలోనూ చురుకుగా కదులుతున్నాడు. ఒకప్పుడు ఫీల్డింగ్‌లో విఫలమై వార్తల్లో నిలిచిన హిట్‌మ్యాన్ ఇప్పుడు డైవ్ చేస్తూ బంతిని ఆపుతున్నాడు. వడోదరలో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్ మిడ్‌వికెట్ దిశగా కొట్టిన బంతిని రోహిత్ ఎడమవైపు డైవ్ చేసి ఆపాడు. అతడలా రెప్పపాటులో స్పందించకుంటే బంతి బౌండరీకి వెళ్లేది. నమ్మశక్యంకాని విధంగా రోహిత్ బంతిని ఆపడంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, పేసర్ సిరాజ్‌లు ఒకింత షాకయ్యారు.
గిల్, సిరాజ్ వెంటనే అతడి వద్దకు వెళ్లి ‘శభాశ్ రోహిత్ భాయ్’ అని అభినందించారు. వారిద్దరూ తనను ప్రత్యేకంగా ప్రశంసించడం రోహిత్ కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. ‘అరే.. అదేమంత కష్టమైన పని కాదు. నేనేమీ అసాధారణమైన విన్యాసం చేయలేదు. నాకేమీ వయసు మీద పడలేదు’ అన్నట్టుగా నవ్వుతూ ఎక్స్ప్రెషన్ పెట్టాడు మాజీ కెప్టెన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.
Rohit Sharma stopped the ball with a brilliant dive, and Shubman Gill and Siraj came over to appreciate him. And he was like, “It wasn’t that difficult, guys, I’m not that old yet.” 😂pic.twitter.com/qgLK3rpfcC
— Kusha Sharma (@Kushacritic) January 11, 2026
భారత క్రికెట్లో ఫ్యాట్మన్గా పేరొందిన రోహిత్ శర్మ ఇప్పుడు స్లిమ్‌గా మారిపోయాడు. ఐపీఎల్ 18వ సీజన్ తర్వాత టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ బాడీబిల్డింగ్ కోసం అన్నట్టుగా క్యాలరీలు కరిగించాడు. ఏకంగా 11 కిలోలు తగ్గి ఫిట్‌గా మారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు రోహిత్. చివరిదైన సిడ్నీ వన్డేలో అజేయ శతకంతో జట్టును గెలిపించిన ఈ ఓపెనర్.. స్వదేశంలో నిరుడు సఫారీలపైన దంచేశాడు. అనంతరం విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీతో చెలరేగాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లోనూ తన బ్యాట్ పవర్ చూపేందుకు సిద్ధమయ్యాడీ సిక్సర్ల వీరుడు.