న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు శ్రీ సత్యసాయి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. సోమవారం కర్ణాటకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గోపీచంద్ డాక్టరేట్ అందుకున్నారు. గోపీచంద్‌తో పాటు వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన నలుగురికి ఈ గౌరవం దక్కింది.
‘రాష్ట్రపతి చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అందుకోవడం గౌరవంగా భావిస్తున్నా. కృషికి తగిన గుర్తింపు దక్కినపుడు మరింత ఉత్సాహం లభిస్తుంది. విభిన్న రంగాలకు చెందిన వారిని గౌరవించడం ఆహ్వానించదగ్గ విషయం’ అని గోపీచంద్ పేర్కొన్నాడు. ఆటగాడిగా ఆల్‌ఇంగ్లండ్ టైటిల్ నెగ్గిన గోపీచంద్.. ప్రస్తుతం యువ ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దుతున్నాడు.