Vizag ODI : వైజాగ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ప్రసిధ్ కృష్ణ(3-52) వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రసిధ్.. రెండో స్పెల్‌లో కీలక వికెట్లు తీసి బ్రేకిచ్చాడు. మిడిలార్డర్‌ను దెబ్బతీసిన ఈ స్పీడ్‌స్టర్.. సెంచరీతో కదంతొక్కిన ఓపెనర్ క్వింటన్ డికాక్(106)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దాంతో.. 199 పరుగుల వద్ద సఫారీ టీమ్ ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం మార్కో యాన్సెన్(14 నాటౌట్), డెవాల్డ్ బ్రెవిస్(26 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. 37 ఓవర్లకు స్కోర్.. 228-5.
సిరీస్ విజేతను నిర్ణయించే పోరులో భారత బౌలర్లు ఆరంభంలో తడబడినా.. మిడిల్ ఓవర్లలో వికెట్లతో చెలరేగారు. యువ పేసర్ అర్ష్‌దీస్ సింగ్(1-30) మొదటి ఓవర్లోనే రియాన్ రికెల్టన్(0) వికెట్ తీసి సఫారీలపై ఒత్తిడి పెంచాడు. అయితే.. క్వింటన్ డికాక్(106), కెప్టెన్ తెంబా బవుమా(48)లు అర్ధ శతకం భాగస్వామ్యంతో దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు.
Castled! 🎯
It’s Prasidh Krishna once again who gets the breakthrough for #TeamIndia 🙌
Quinton de Kock departs for 106
Updates ▶️ https://t.co/HM6zm9o7bm#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/cOYYg1YsyO
— BCCI (@BCCI) December 6, 2025
హాఫ్ సెంచరీకి చేరువైన బవుమాను జడేజా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాథ్యూ బ్రీట్జ్(24), రాయ్‌పూర్ శతక వీరుడు మర్క్రమ్(1)లను ఔట్ చేసిన ప్రసిధ్ కృష్ణ(3-52) స్కోర్ వేగానికి బ్రేకులు వేశాడు. కాసేపటికే 80 బంతుల్లో సెంచరీతో మెరిసిన డికాక్‌ను బౌల్డ్ చేసి సఫారీలను గట్టి దెబ్బకొట్టాడు.