చెన్నై: ఇండియన్ పేస్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ(Prasidh Krishna) సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌ను దారుణంగా దెబ్బతీశాడు. చెన్నైలో జరుగుతున్న మూడో వన్డేలో .. బౌలర్ ప్రసిద్ధ కృష్ణ మొదటి నాలుగు వికెట్లను తన ఖాతాలోనే వేసుకున్నాడు. తొలి స్పెల్‌లో 5 ఓవర్లు వేసి .. ఆరు పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఆఫ్ఘన్ బ్యాటర్లు గుర్బాజ్, జర్దాన్, రహ్మత్ షా, రసూలీని వరుసగా ఔట్ చేశాడు. దీంతో పీకల్లోతు కష్టాల్లో పడింది ఆఫ్ఘనిస్తాన్. చెన్నై పిచ్‌పై బౌన్స్‌ను రాబట్టిన ప్రసిద్ధ కృష్ణకు.. ఆఫ్ఘన్ బ్యాటర్లు తమ వికెట్లను సమర్పించుకున్నారు. అయితే తొలి మూడు క్యాచ్‌లను మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అందుకున్నాడు. ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన రోహిత్.. తొలి మూడు క్యాచ్‌లను దాదాపు ఒకే తరహాలో అందుకున్నారు. తాజా సమాచారం ప్రకారం 15 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 69 రన్స్ చేసింది. హస్మతుల్లా, హజ్మతుల్లా ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు.
Identical setups, identical results 🔄
Prasidh Krishna 🤝 Rohit Sharma 😎
Updates ▶️ https://t.co/kHgF4bqTg3#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/Bf2YPIA59l
— BCCI (@BCCI) June 20, 2026