పాఫొస్ (సైప్రస్): ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత్ భారీ ఆశలు పెట్టుకున్న ప్రజ్ఞానంద.. టైటిల్ రేసు నుంచి తప్పుకున్నా అతడి సోదరి వైశాలి మాత్రం అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నది. మహిళల విభాగంలో ఆమె.. గురువారం రాత్రి జరిగిన 10వ రౌండ్లో అన్నా ముజిచుక్ (ఉక్రెయిన్)తో గేమ్‌ను డ్రాగా ముగించి పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో సోలోగా ఆధిక్యంలోకి వచ్చింది.
9వ రౌండ్లో భారత్‌కే చెందిన దివ్య దేశ్‌ముఖ్‌ను ఓడించిన ఆమె.. రాబోయే మూడు గేమ్స్‌లో ఇలాగే రాణిస్తే విజేతగా నిలవడం పెద్ద కష్టమేం కాదు. 5.5 పాయింట్లతో ఝు జినర్ (చైనా), ముజిచుక్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఓపెన్ క్యాటగిరీ పదో రౌండ్లో ప్రజ్ఞానంద.. సిందరొవ్ (ఉజ్బెకిస్థాన్)చేతిలో ఓడాడు. ఓపెన్ విభాగంలో ఈ ఉజ్బెకిస్థాన్ కుర్రాడు ఏకంగా 8 పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు.