అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఎదుర్కొంటు న్న ఇబ్బందులపై వైసీపీ ఎంపీలు( YCP MPs ) పార్లమెంట్లో ప్రస్తావనకు తీసుకురావాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jagan ) ఆదేశించారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ( Parliament Session ) ప్రారంభమవుతున్న సందర్భంగా తాడేపల్లి నివాసంలో వైసీపీ ఎంపీలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు.
ముఖ్యంగా టెట్ పరీక్షల పేరిట ఇబ్బందులకు గురవుతున్న ఉపాధ్యాయుల సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లి రద్దు చేయాలని కోరాలని సూచించారు. అమరావతి పేరిట కూటమి నాయకులు దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పూలింగ్‌కు భూములు ఇవ్వని రైతులపై దారుణాలకు దిగుతున్నారని వివరించారు. సోషల్ మీడియా పేరుతో చంద్రబాబు తీవ్ర అరాచకాలకు పాల్పడుతున్న విషయాన్ని, ఆక్వా రైతుల సమస్యలను సభా దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.