AP News | అంబటి రాంబాబు ఆంబోతులా రంకెలేయడం దారుణం : గోరంట్ల
AP News | కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేళ చోటుచేసుకున్న పరిణామాలు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రవర్తనపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
AP News : కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేళ చోటుచేసుకున్న పరిణామాలు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రవర్తనపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను గౌరవప్రదంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుంటే, అంబటి రాంబాబు పెద్దపెద్దగా అరుస్తూ ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని బుచ్చయ్య చౌదరి తీవ్రంగా తప్పుబట్టారు.
“ఒక మహోన్నత నేత అంత్యక్రియలు జరుగుతుంటే అక్కడ అంబటి రాంబాబు ఒక ఆంబోతులాగా రంకెలేస్తూ ప్రవర్తించడం అత్యంత దారుణం. బతికున్నప్పుడు ముద్రగడను అవమానించారు. ఇప్పుడు చావు దగ్గర కూడా నీచమైన రాజకీయం చేయడం వైసీపీ నేతలకే చెల్లింది” అని ధ్వజమెత్తారు. కన్న తండ్రి చివరిచూపు కోసం వచ్చిన ముద్రగడ కుమార్తెను భౌతికకాయం వద్దకు రానివ్వకుండా అడ్డుకోవడాన్ని బుచ్చయ్య చౌదరి తీవ్రంగా ఖండించారు. కుటుంబంలో ఇలాంటి గొడవలు పెట్టడం, కన్నబిడ్డను దూరం చేయడం ఏ రకమైన సంస్కృతి అని ఆయన ప్రశ్నించారు.
వైసీపీ అధినేత జగన్ ఎక్కడికి వెళ్లినా అక్కడ అల్లర్లు సృష్టించడం పరిపాటిగా మారిందని బుచ్చయ్య చౌధరి ఆరోపించారు. కేవలం రాజకీయ మైలేజ్, హైప్ క్రియేట్ చేసుకోవడం కోసమే ఇలాంటి శవ రాజకీయాలు, డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అంత్యక్రియలకు వెళుతూ కూడా భారీ ర్యాలీలు చేయడం ఏంటని నిలదీశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

