IPL2024 Mini Auction : ఇండియన్ ప్రీమియర్ 17వ సీజన్ మినీ వేలం మొదలైంది. దుబాయ్ గడ్డపై కొకాకోలా ఎరేనా హోటల్లో జరుగుతున్న వేలాన్ని ఫేమస్ ఆక్షనీర్ మల్లికా సాగర్ (Mallika Sagar) నిర్వహిస్తోంది. ఆక్షన్‌లో తొలి రౌండ్లో విండీస్ టీ20 సారథి రోవ్‌మన్ పావెల్(Rovman Powell) అత్యధికంగా రూ. 7.40 కోట్లు పలికాడు. రూ. కోటికి రిజిష్టర్ అయిన ఈ విధ్వంసక బ్యాటర్‌ను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
రోవ్‌మన్ పావెల్
ఆస్ట్రేలియా వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్(Travis Head) రెండో స్థానంలో నిలిచాడు. రూ. 2 కోట్ల కనీస ధర ఉన్న ఈ స్టార్ ఓపెనర్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్(SRH), చెన్నై సూపర్ కింగ్స్(CSK) పోటీ పడ్డాయి. చివరకు హైదరాబాద్ రూ.6.80 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ చిచ్చరపిడుగు హ్యారీ బ్రూక్ రూ. 4 కోట్లు పలికాడు. ఈ స్టార్ బ్యాటర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. నిరుడు వేలంలో రూ. 13.25 కోట్లు పలికిన బ్రూక్.. ఈసారి తక్కువ ధరకే అమ్ముడుపోవడం విశేషం.
Mana Travis is a 𝐇YD𝐄R𝐀BA𝐃I 🔥#HereWeGOrange pic.twitter.com/SUtbRJfXZA
— SunRisers Hyderabad (@SunRisers) December 19, 2023
ఈ రౌండ్లో స్టార్ బ్యాటర్ దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ రీలే రస్సో అమ్ముడు పోలేదు. రూ.2 కోట్ల కనీస ధర ఉన్న ఇతడిని కొనేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. అతడితో పాటు ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్, భారత క్రికెటర్లు కరుణ్ నాయర్, మనీశ్ పాండేలను సైతం ఎవరూ కొనుగోలు చేయలేదు.