Mohanlal | మాలీవుడ్ గేమ్ ఛేంజర్.. మోహన్‌లాల్ దృశ్యంకు ఇప్పటికీ సూపర్ క్రేజ్
Mohanlal | మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal), మీనా కాంబినేషన్లో క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు.. అన్ని ఇండస్ట్రీల చూపు మలయాళ చిత్రసీమవైపు పడేలా చేసింది. ఇండియన్ సినిమాలో ఐకానిక్ చిత్రంగా నిలిచిపోయిన దృశ్యం మాలీవుడ్ ఇండస్ట్రీ గేమ్ ఛేంజర్‌గా నిలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
Mohanlal | ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు వస్తున్నాయంటే క్రేజ్ మామూలుగా ఉండదు. అలాంటి సినిమాల జాబితాలో టాప్‌లో ఉంటుంది దృశ్యం.
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal), మీనా కాంబినేషన్లో క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు.. అన్ని ఇండస్ట్రీల చూపు మలయాళ చిత్రసీమవైపు పడేలా చేసింది. ఇండియన్ సినిమాలో ఐకానిక్ చిత్రంగా నిలిచిపోయిన దృశ్యం మాలీవుడ్ ఇండస్ట్రీ గేమ్ ఛేంజర్‌గా నిలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
రూ.50 కోట్లు వసూళ్లు రాబట్టిన తొలి మాలీవుడ్ చిత్రంగా అరుదైన ఫీట్ నమోదు చేసింది. దృశ్యం (Drishyam) విడుదలై నేటికి (2013 డిసెంబర్ 19) సక్సెస్‌ఫుల్‌గా పదేళ్లు పూర్తి చేసుకుంది. దృశ్యం సక్సెస్‌తో జీతూ జోసెఫ్, మోహన్ లాల్ సూపర్‌హిట్ కాంబోగా నిలిచిపోయింది. ఈ సినిమాను తమిళం, హిందీ భాషల్లో ప్రాంఛైజీగా విడుదల చేయగా.. ప్రతీ చోటా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. దృశ్యం చిత్రాన్ని తెలుగులో వెంకటేశ్, మీనా కాంబినేషన్లో తెరకెక్కించగా.. హిందీ (2015లో రీమేక్) అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్ హీరోహీరోయిన్లుగా నటించారు.
దృశ్యంలో అన్సిబా హస్సన్, ఏస్తెర్ అనిల్, కళాభవన్ షాజాన్, ఆశా శరత్, సిద్దిఖీ, రోషన్ బషీర్, నీరజ్ మాధవ్ కీలక పాత్రల్లో నటించారు. ఆ తర్వాత 2021లో విడుదలైన దృశ్యం 2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
మోహన్‌లాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వీటిలో ఒకటి మలైకోటై వాలిబన్. బాలీవుడ్ యాక్టర్లు విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని మ్యాక్స్ ల్యాబ్స్-సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్లపై జాన్-మేరీ క్రియేటివ్ తెరకెక్కిస్తున్నారు.మోహన్ లాల్ దీంతోపాటు వృషభ, Empuraan, Rambaan , BARROZ, Ram: Part 1 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన ఈ మూవీస్ ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Decade for the Iconic movie from Indian Cinema #Drishyam
Game changer of Mollywood Industry….first 50cr collected movie 🎉
L-Jeethu combo ❣️ #Mohanlal pic.twitter.com/ojwQqM3pxY
— ABHILASH S NAIR (@itsmeStAbhi) December 19, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

