IND vs AFG : టీ20 వరల్డ్ కప్ లీగ్ దశలో దుమ్మురేపిన భారత జట్టు (Team India)కు కరీబియన్ గడ్డపై తొలి సవాల్ ఎదురవ్వనుంది. న్యూజిలాండ్‌కు షాకిచ్చిన అఫ్గనిస్థాన్‌తో సూపర్ 8 ఫైట్‌కు రోహిత్ శర్మ (Rohit Sharma) బృందం సిద్దమైంది. ఇప్పటివరకూ ఒకే జట్టుతో ఆడుతున్న భారత్.. ఈ మ్యాచ్‌లో మార్పులు చేసే అవకాశం లేకపోలేదు. బార్బడోస్ పిచ్ స్పిన్‌కు అనుకూలించనుండడమే అందుకు కారణం. దాంతో, బెంచ్‌కే పరిమితమవుతున్న చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ లేదా యజ్వేంద్ర చాహల్‌ను ఆడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా(Piyush Chawla) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘అఫ్గనిస్థాన్‌తో తొలి ఫైట్‌లో టీమిండియాకు స్పెషలిస్ట్ స్పిన్నర్ కావాలి. స్లో పిచ్‌లపై అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలతో పాటు కుల్దీప్ను ఆడించాలి. ఫామ్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా మూడో సీమర్‌గా జట్టులో ఉంటాడు. అయితే.. సిరాజ్, అర్ష్‌దీప్‌లలో ఎవరో ఒకరు బెంచ్ మీదకు వెళ్లొచ్చు. కానీ, లెప్ట్ ఆర్మ్ పేసర్‌పై అర్ష్‌దీప్ ఫామ్ దృష్ట్యా సిరాజ్‌ను తప్పిస్తారని అనుకుంటున్నా’ అని చావ్లా వెల్లడించాడు. అదే జరిగితే.. టీ20ల్లో మెరుగైన రికార్డు ఉన్న చాహల్ పరిస్థితి ఏంటీ? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
Gearing 🆙 for the Super 8s 👌 👌
Prep Mode 🔛 for #TeamIndia 👍 👍#T20WorldCup pic.twitter.com/DjR38cuJZi
— BCCI (@BCCI) June 19, 2024
వరల్డ్ కప్‌లో గ్రూప్ ఏ లోని టీమిండియా అజేయంగా సూపర్ 8కు దూసుకొచ్చింది. మరోవైపు అఫ్గనిస్థాన్ సైతం హ్యాట్రిక్ విజయాలతో రెండో దశలో అడుగుపెట్టింది. కానీ, చివరి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ దెబ్బకు రషీద్ ఖాన్ సేన కుదేలైంది. ఏకంగా 104 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే.. సూపర్ 8లో అప్గన్ జట్టును తేలికగా తీసుకోవడానికి లేదు.
A big change might be on the cards for India in the Super Eight stage 👀#T20WorldCup | #AFGvIND
More ➡ https://t.co/mcn3VvBLfp pic.twitter.com/cBWomAYGxP
— ICC (@ICC) June 20, 2024
ఎందుకంటే.. ఆ జట్టు ప్రధాన పేసర్ ఫజల్ హక్ ఫారూఖీ అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. స్పిన్ త్రయం రషీద్, నూర్ అహ్మద్, మహ్మద్ నబీలు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. అందుకని బార్బడోస్ పిచ్‌పై అఫ్గన్ బ్యాటర్లకు ముకుతాడు వేయాలంటే రోహిత్ స్పిన్నర్లపై ఆధారపడక తప్పదు. కాబట్టి.. కుల్దీప్ లేదా చాహల్‌కు తుది జట్టులో చోటివ్వాలని మాజీ క్రికెటర్లంతా ముక్తకంఠంతో అంటున్నారు.