Seetha Kalyana Vaibhogame | టాలీవుడ్లో అప్పుడప్పుడు నూతన నటీనటులతో కొత్త సినిమాలు వస్తుంటాయని తెలిసిందే. వీటిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇదే కోవలో విడుదలకు ముస్తాబవుతోంది సీతా కళ్యాణ వైభోగమే (Seetha Kalyana Vaibhogame). సుమన్ తేజ్, గరీమా చౌహాన్ ’(డెబ్యూ) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నాగినీడు, శివాజీరాజా ఇతర కీలక పాత్రల్లో నటిస్తు్న్నారు.
డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాచాల యుగంధర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ జూన్ 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత యుగంధర్ సినిమా విశేషాలు ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. తాను కళారంగం మీదున్న ఆసక్తితోనే సినిమాల్లోకి వచ్చానని చెప్పారు నిర్మాత. సీతా కళ్యాణ వైభోగమే చిత్రంలో నటించిన సుమన్ తేజ్, గరీమా చౌహాన్ కొత్తవాళ్లని.. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో డ్రీమ్ గేట్ ప్రొడక్షన్‌ను ప్రారంభించామన్నారు. సుమన్ తేజ్, గరీమా చౌహాన్ కొత్తవాళ్లైనప్పటికీ అద్భుతంగా నటించారు. ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విలన్‌గా మెప్పించిన గగన్ విహారి గురించి సినిమా విడుదలయ్యాక అందరూ మాట్లాడుకుంటారన్నారు.
సీతా కళ్యాణ వైభోగమే ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా కుటుంబసమేతంగా చూసి ఆనందించే సినిమా అని చెప్పారు. పుష్ప 2, దేవర సినిమాలకు పనిచేసిన డ్రాగన్ ప్రకాశ్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. కథలు బాగుంటే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. ఈ సినిమా కథ మీద మాకు నమ్మకముందన్నారు యుగంధర్.
సీతా కళ్యాణ వైభోగమే ట్రైలర్..