ODI World Cup 2023 : ప్రపంచ కప్ పోటీలకు ఇంకా పదిహేను రోజులే ఉంది. దాంతో, ఐసీసీ(ICC), బీసీసీఐ(BCCI) ఈ మెగాటోర్నీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. అంతేకాదు ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న ప్రధాన స్టేడియాల మరమ్మతు ప్రక్రియ పూర్తికావొచ్చింది. ప్రపంచ కప్ స్టేడియాల్లో ఒకటైన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్(Eden Gardens) స్టేడియం ఇప్పుడు కొత్త సొబగులతో తళుక్కుమంటోంది.
డ్రెస్సింగ్ రూమ్ నుంచి ప్రేక్షకులు కూర్చొనే కుర్చీల వరకు అంతా అందంగా తీర్దిదిద్దారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Sourav Ganguly) మరమ్మతు పనులను పర్యవేక్షించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ స్టేడియం కొత్త లుక్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
The new look of Eden gardens Stadium for the World Cup 2023.
– One of the most beautiful stadium in the world..!! pic.twitter.com/pMFWa8VfCG
— CricketMAN2 (@ImTanujSingh) September 19, 2023
ఒక నాకౌట్ మ్యాచ్‌తో కలిపి ఐదు ప్రపంచ కప్ మ్యాచ్‌లకు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇస్తోంది. నెదర్లాండ్స్ – బంగ్లాదేశ్, పాకిస్థాన్ – బంగ్లాదేశ్, భారత్ – దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ – పాకిస్థాన్ మ్యాచ్‌లు ఈ స్టేడియంలో జరుగనున్నాయి. నవంబర్ 16న ఇదే గ్రౌండ్లో రెండో సెమీ ఫైనల్ పోటీ నిర్వహించనున్నారు.
అక్టోబర్ 5 నుంచి భారత్‌లో వరల్డ్ కప్ మొదలవ్వనుంది. 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 2011లో ధోనీ(MS Dhoni) సారథ్యంలోని టీమిండియా ప్రపంచ కప్ ట్రోఫీని అందుకుంది. ఆ తర్వాత 2013లో చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2013) విజేతగా నిలిచింది. అప్పటి నుంచి వరల్డ్ కప్ ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. దాంతో, రోహిత్ శర్మ బృందం ఈసారి సొంత గడ్డపై చాంపియన్‌గా అవతరించాలనే పట్టుదలతో ఉంది.