Asian Games 2023 : పొట్టి క్రికెట్(T20 Cricket)లో మరో సంచలనం నమోదైంది. ఆసియా గేమ్స్(Asian Games 2023)లో మంగోలియా మహిళల జట్టు(Mangolia Womens Team) కేవలం 15 పరుగులకే ఆలౌటయ్యింది. ఆ జట్టులోని ఏడుగురు డకౌట్ కావడం విశేషం. ఇండోనేషియా(Indonasia)తో ఈ రోజు జరిగిన మ్యాచ్లో మంగోలియాకు ఇదే తొలి అంతర్జాతీయ పోరు. కానీ, ఇండోనేషియా బౌలర్లు చెలరేగంతో మంగోలియా 10 ఓవర్లలోనే కుప్పకూలింది. ఇండోనేషియా పేసర్ అండ్రియాని 4 వికెట్లతో సత్తా చాటింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. భారీ ఛేదనలో మంగోలియా జట్టు కనీస పోరాటం చేయలేకపోయింది. వచ్చినవాళ్లు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. దాంతో ఇండోనేషియా 172 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.