Philip Salt : ఇంగ్లండ్ నయా సంచలనం ఫిలిఫ్ సాల్ట్(Philip Salt) పొట్టి క్రికెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. వెస్టిండీస్ గడ్డపై ముగిసిన టీ20 సిరీస్(T20 Series)లో ఈ చిచ్చర పిడుగు వరుస శతకాలతో హడలెత్తించాడు. ఈ క్రమంలోనే సాల్ట్ టీ20 ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్(Bilateral Series)లో అత్యధిక పరుగులు బాదిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. తద్వారా పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan) ఏడాది క్రితం నెలకొల్పిన ఆల్ టైమ్ రికార్డును సాల్ట్ బద్దలు కొట్టాడు.
కరీబియన్ గడ్డపై మొత్తం 5 ఇన్నింగ్స్‌ల్లో ఈ డాషింగ్ బ్యాటర్ 185.95 స్ట్రయిక్ రేటుతో 331 రన్స్ కొట్టాడు. అతడి విధ్వంసక ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు ఉన్నాయి. పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఇంగ్లండ్‌పై 63.20 సగటుతో 316 రన్స్ చేశాడు. ఇప్పటివరకూ అదే అత్యుత్తమ రికార్డుగా ఉంది. కానీ, సాల్ట్ తన విధ్వసంక బ్యాటింగ్‌తో రిజ్వాన్ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. అయితే.. సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో సాల్ట్ 38 పరుగులకే వెనుదిరిగాడు.ఈ మ్యాచ్‌లో నెగ్గిన విండీస్ 3-2తో సిరీస్ కైవసం చేసుకుంది.
Mind-blowing numbers 🤯
No player has ever scored more runs in a five-match Men’s T20I series than Phil Salt 🔥#WIvENG pic.twitter.com/8SE4b7jy3X
— ICC (@ICC) December 22, 2023
ఐపీఎల్ 16వ సీజన్లో సాల్ట్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్‌గా రాణించిన ఈ ఇంగ్లీష్ ప్లేయర్ 9 మ్యాచుల్లో 218 పరుగులు సాధించాడు. అయితే.. 17వ సీజన్ కోసం ఢిల్లీ అతడిని అట్టిపెట్టుకోలేదు. దాంతో, మినీ వేలంలో పేరు రిజిష్టర్ చేసుకున్నాడు. విండీస్‌పై రెండు సెంచరీలతో వార్తల్లో నిలిచినప్పటికీ సాల్ట్‌ను కొనేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు.