Pallavi Prashanth | పల్లవి ప్రశాంత్. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న పేరు ఇది. రైతు బిడ్డగా బిగ్ బాస్లోకి అడుగుపెట్టి ఏకంగా సీజన్ 7 టైటిల్ ఎగరేసుకుపోయాడు ఇతడు. అయితే ఇక్కడివరకు బానే ఉంది. కానీ అతడిని విజేతగా అనౌన్స్ చేసిన అనంతరం ఫ్యాన్స్ చేసిన విధ్వంసాన్ని అప్పుడే మరచిపోలేము. అయితే తాజాగా ఈ దాడి ఘటనకు సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది.
ఈ వీడియోలో బిగ్బాస్ టైటిల్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియో నుంచి ఊరేగింపుగా బయలుదేరాడు. అయితే ప్రశాంత్ దగ్గరికి పోలీసులు వచ్చి ”నీ వల్లే దాడి ఎక్కువ అవుతుంది. దయచేసి ఇక్కడనుంచి వెళ్ళిపో అంటూ పోలీసులు వారించగా.. ప్రశాంత్ మాట్లాడుతూ.. ఒక రైతు బిడ్డ గెలిచాడు.. మాకు అధికారం లేదా అంటూ సానుభుతి మాటలు చెప్పడం వీడియోలో చూడోచ్చు. ఇక ఫ్యాన్స్ చేసిన విధ్వంసంలో ప్రశాంత్ ప్రమేయం కూడా ఉందని ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రశాంత్పై దుమ్మెత్తిపోస్తున్నారు. అతడిని అరెస్ట్ చేయడం తప్పేమి కాదని కామెంట్స్ చేస్తున్నారు.
Parledu inko 2 weeks extends cheyachu jail. #BiggBossTelugu7 pic.twitter.com/ibw2wW4O6L
— Harish Varma 🌶️ (@harish_484) December 21, 2023
ఇంతకీ ఏం జరిగిందంటే..
బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడనే వార్త ముందుగానే బయటకు పొక్కడంతో చాలామంది ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చేశారు. అదే సమయంలో అమర్దీప్ ఫ్యాన్స్ కూడా అక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కొందరు రోడ్డుపై నానా హంగామా చేశారు. ఇతర కంటెస్టెంట్ల కార్లపై దాడికి దిగారు. ఈ క్రమంలో అమర్దీప్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రోడ్డుపైనే కొట్టుకున్నారు. ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. ఈ దాడులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్గా తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు అల్లర్ల వెనుక పల్లవి ప్రశాంత్ అభిమానుల ప్రమేయం ఉందని గుర్తించారు. ఈ మేరకు పల్లవి ప్రశాంత్, అతని అభిమానులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా పల్లవి ప్రశాంత్, ఏ-2గా అతని తమ్ముడు మనోహర్, ఏ-3గా మరో స్నేహితుడి పేరును నమోదు చేయగా.. పల్లవి ప్రశాంత్ (26)కు, అతడి సోదరుడు పరశురామ్ అలియాస్ మహావీర్ (24)కు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు.