AUSW vs PAKW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచుల్లో భారీ విజయాలు సాధించిన ఆస్ట్రేలియా హ్యాట్రిక్ కొట్టింది. సెమీస్ బెర్తు దిశగా మరో అడుగు వేస్తూ మూడో గేమ్‌లో పాకిస్థాన్‌పై ఆసీస్ 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. 82 పరుగుల స్వల్ప ఛేదనలో విధ్వసంక ఆల్‌రౌండర్ అలీసా పెర్రీ(37 నాటౌట్) కెప్టెన్ అలీసా హేలీ(22) లు దంచికొట్టగా 11 ఓవర్లలోనే కంగారూ జట్టు జయకేతనం ఎగురవేసింది. మెరుగైన రన్‌రేటుతో గ్రూప్ ఏ నుంచి అగ్రస్థానం పదిలం చేసుకుంది.
ఆరుసార్లు చాంపియన్ అయిన ఆస్ట్రేలియా ఏడో కప్ వేటలో దూసుకెళ్లుతోంది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుగా ఓడిస్తూ సెమీస్ దిశగా అడుగులు వేస్తోంది. తొలి రెండు మ్యాచుల్లో శ్రీలంక, న్యూజిలాండ్‌లపై అద్బుత విజయాలు సాధించిన అలీసా హేలీ బృందం ఇప్పుడు పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. తొలుత పాక్‌ను 82కే ఆలౌట్ చేసిన ఆసీస్.. కొద్దిపాటి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు బేత్ మూనీ (15), అలీసా హేలీ(22)లు బౌండరీలతో విరుచుకుపడి స్కోర్ బోర్డును పరుగెత్తించారు.
Injuries plagued the playing XI, but Australia still registered their third win of the tournament 📈https://t.co/9NA1RcHV3I #T20WorldCup #AUSvPAK pic.twitter.com/CorfFziDYv
— ESPNcricinfo (@ESPNcricinfo) October 11, 2024
మూనీ ఔటయ్యాక ఎలీసా పెర్రీ (37 నాటౌట్) జతగా హేలీ రెచ్చిపోయింది. అయితే.. 25 పరుగుల వద్ద ఆమె ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేసింది. ఆకాసేపటికే హేలీ కాలు నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడింది. అప్పటికి ఆసీస్ విజయానికి 13 పరుగులు కావాలంటే. ఆ దశలో క్రీజులోకి వచ్చిన అష్ గార్డ్నర్(7 నాటౌట్) చకచకా సింగిల్స్, డబుల్స్ తీస్తూ పెర్రీకి సహకరించింది. 10వ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసిన పెర్రీ ఆస్ట్రేలియాకు సూపర్ విక్టరీని అందించింది.
చావోరేవో పోరులో పాకిస్థాన్ బ్యాటర్లు తడబడ్డారు. కెప్టెన్ ఫాతిమా సనా గైర్వాహజరీలో మునీబా అలీ పగ్గాలు అందుకోగా.. ఆస్ట్రేలియా బౌలర్ల విజృంభనణతో ప్రధాన ప్లేయర్లు సైతం కనీస పోరాటం చేయకుండానే డగౌట్ చేరారు. అష్ గార్డ్నర్(421) తిప్పేయడంతో పాక్ నిర్ణీత ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటయ్యింది. 13 పరుగుల వద్ద కెప్టెన్ మునీబా అలీ(7) వికెట్ తీసిన మొలినెక్స్ పాక్‌ను ఒత్తిడిలో పడేసింది.
An overly cautious powerplay left Pakistan struggling to break free for the rest of the innings
Live: https://t.co/ZUrGieKLug | #AUSvPAK pic.twitter.com/6oGDUweHAu
— ESPNcricinfo (@ESPNcricinfo) October 11, 2024
ఆ తర్వాత సథర్లాండ్, వరేహమ్లు వికెట్ల వేట మొదలెట్టగా 39 పరుగులకే పాక్ సగం వికెట్లు కోల్పోయింది. ఆ దశలో అలియా రియాజ్(26) అద్భుతంగా ఆడింది. ఆమె తర్వాత ఇరమ్ జావేద్(12)లు టాప్ స్కోరర్లు అంటే ఆసీస్ బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఆసీస్ బౌలర్లలో అనాబెల్ సథర్లాండ్(2/15), జార్జియా వరేహమ్(2/16)లు రాణించారు.