Srisailam Calendar | శ్రీశైలం : శ్రీశైలం దేవస్థానం ప్రతిష్టాత్మకంగా రూపొందించే వార్షిక క్యాలెండర్‌ను దసరా ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితోపాటు స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కమీషనర్ సత్యనారాయణలు విడుదల చేశారు.
శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞచే లిఖించిన పంచాంగ వివరాలతోపాటు స్వామిఅమ్మవార్ల మూల విరాట్టు ఛాయా చిత్రాలు, పరివార దేవతామూర్తుల చిత్రాలతో కూడిన మూడు రకాల సైజుల క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్‌లోని చిత్రాలను హైదరాబాద్‌కు చెందిన ప్రాక్సిస్ స్టూడియో ఛాయాచిత్ర నిపుణులు బి శ్రీధర్‌రాజు చిత్రీకరించినట్లు శ్రీశైలప్రభ ఎడిటర్ అనిల్ కుమార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Srisailam | సిద్ధిదాయినిగా శ్రీశైలం భ్రామరి.. ఘనంగా దసరా బ్రహ్మోత్సవాలు
Ollie Pope | ఇంగ్లండ్ కెప్టెన్ తికమక.. ఏం చేశాడో తెలిస్తే నవ్వాగదు..!