PCB : సొంతగడ్డపై ఇంగ్లండ్ మీద చిరస్మరణీయ విజయం సాధించిన పాకిస్థాన్(Pakistan)కు వైట్‌బాల్ కొత్త హెడ్‌కోచ్ అనివార్యమైంది. టీ20 వరల్డ్ కప్ అనంతరం కోచ్‌గా వచ్చిన గ్యారీ కిర్‌స్టెన్ (Gary Kirsten) రాజీనామా చేయడంతో మరొకరిని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో పాక్ జట్టు అదరగొడుతోంది. దాంతో, పీసీబీ కీలక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మాదిరిగానే అన్ని ఫార్మాట్లకు ఒకే కోచ్‌ను నియమించాలనే ఆలోచనతో ఉంది. ప్రస్తుతం టెస్టు జట్టు కోచ్‌గా ఉన్న జేసన్ గిలెస్పీ(Jason Gillespie)కి వన్డే, టీ20 కోచ్‌గా బాధ్యతలు అప్పగించేందుకు పీసీబీ మొగ్గు చూపిస్తోందట. ఈ విషయాన్ని పీసీబీలోని ఓ అధికారి వెల్లడించాడు. ఇప్పటికైతే కొత్తవాళ్లను తీసుకోకుండా గిలెస్పీని మూడు ఫార్మట్లకు కోచ్‌గా నియమించాలని బోర్డు ఆలోచిస్తోంది అని సదరు అధికారి మీడియాతో చెప్పాడు.
Jason Gillespie on Pakistan’s full-time white-ball coaching role after taking charge in the ongoing series against Australia. pic.twitter.com/PG4XuGqxpb
— CricTracker (@Cricketracker) November 8, 2024
గిలెస్పీ కోచింగ్‌లో పాకిస్థాన్ జట్టు ఆట మెరుగైంది. అయితే.. బంగ్లాదేశ్‌పై 2-0 వైట్ వాష్ గిలెస్పీని ఒకింత ఇబ్బందికి గురి చేసింది. ఆ వెంటనే ఇంగ్లండ్ చేతిలో ఇన్నింగ్స్ 47 పరగులు పరాజయం. అంతే.. జట్టులోకి ఇద్దరు స్పిన్నర్లు సాజిద్ ఖాన్, నుమాన్ అలీలను తెచ్చిన పాక్ విజయాల వరుసగా రెండింటా జయభేరి మోగించి సిరీస్ కొల్లగొట్టింది.
In April:
PCB appointed Gary Kirsten as White ball Coach & Jason Gillespie as Red ball Coach.
In October:
Gary Kirsten submitted his resignation to PCB, Jason Gillespie will coach the Pakistan White ball team in Australia.
A total Circus in Pakistan cricket. pic.twitter.com/VXaqEXXmjb
— Johns. (@CricCrazyJohns) October 28, 2024
ఆలోపే కిర్‌స్టెన్ రాజీనామా వార్త పీసీబీని కుదిపేసింది. అంతలోనే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఖారారు కావడంతో .. గిలెస్పీని వైట్‌బాల్ కోచ్‌గా చేయక తప్పలేదు. ఆసీస్ పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లలో పాక్ అదరగొడితే మూడు ఫార్మట్లకు గిలెస్పీని ప్రధాన కోచ్‌గా నియమించాలని పీసీబీ భావిస్తోంది.