Pushpa2The Rule | టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం పుష్ప ది రూల్(Pushpa2The Rule). ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తుంది. రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ తప్ప మిగతా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ స్పెషల్ సాంగ్‌ను ఎవరు చేస్తున్నారా అనే దానిపై కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఒకవైపు సమంతనే మళ్లీ చేస్తుంది అనగా.. ఇంకోవైపు బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ ఐటం సాంగ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే శ్రద్ధ కపూర్ ఈ పాట కోసం ఎక్కువ మొత్తంలో పారితోషికం అడుగుతుండడంతో టాలీవుడ్ నటి శ్రీలీలను ఈ సాంగ్ కోసం తీసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే వార్త ఇప్పుడు నిజం అయ్యింది. పుష్ఫ 2లో స్పెషల్ సాంగ్ చేస్తుంది శ్రీలీల. తాజాగా ఈ పాట షూటింగ్‌కు సంబంధించిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో అల్లు అర్జున్ ఎర్ర రంగు డ్రెస్‌లో ఉండగా.. శ్రీలీల హాట్ హాట్‌గా కనిపిస్తుంది.
#Pushpa2TheRule 💃🕺 pic.twitter.com/cxuEIfCOLv
— Telugu Chitraalu (@TeluguChitraalu) November 8, 2024