Asia Cup : ఆసియా కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్లో భారత్ (India), పాకిస్థాన్ (Pakistan ) ఎదురుపడుతున్నాయి. ఇప్పటికే లీగ్ దశ, సూపర్-4లో ఆధిపత్యం చెలాయించిన టీమిండియా టైటిల్ పోరులోనూ దాయాదిని దెబ్బకొట్టాలని భావిస్తోంది. మరోవైపు చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను వణికించిన పాక్ తగ్గపోరు ఇచ్చేందుకు సిద్ధమైంది. మరోసారి ‘నో షేక్ హ్యాండ్’ విధానాన్ని పాటించాలనుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ సేనకు షాకింగ్ న్యూస్. వితలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) ట్రోఫీని ప్రదానం చేయనున్నాడు.
‘శనివారం సాయంత్రం నఖ్వీ దుబాయ్ చేరుకుంటారు. ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడి హోదాలో అతడు విజేతకు ట్రోఫీని అందిస్తాడు. ఈ విషయంపై బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది’ అని పీటీఐతో ఒక అధికారి అన్నాడు. బీసీసీఐని బహిరంగంగానే విమర్శించే నఖ్వీ ఆసియా క్రికెట్ మండలి చీఫ్ హోదాలో ట్రోఫీని బహూకరించనున్నాడు. దాంతో.. ఫైనల్లో గెలిచిన జట్టు అతడి చేతుల మీదుగానే ఆసియా కప్‌ను స్వీకరించాల్సి ఉంటుంది.
ACC President Mohsin Naqvi said, “I’m excited to witness a great final and look forward to handing over the trophy to the winners tomorrow.” pic.twitter.com/jxfmjZ1HQh
— Sheri. (@CallMeSheri1_) September 27, 2025
టైటిల్ పోరులో పాక్‌ను చిత్తు చేసి టీమిండియా విజేతగా నిలిస్తే.. నఖ్వీకి షేక్ హ్యాండ్ ఇవ్వకతప్పదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ట్రోఫీని అందుకొనే సమయంలో అతడితో కరచాలనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి.. అందుకు సూర్య సిద్ధపడుతాడా?..ఈ విషయంపై బీసీసీఐ రియాక్షన్ ఏంటి? అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
It has taken more than 40 years but we finally have it: a first India-Pakistan Asia Cup final 🏆 pic.twitter.com/T2vOiRfURQ
— ESPNcricinfo (@ESPNcricinfo) September 26, 2025
లీగ్ దశలో సెప్టెంబర్ 14న మ్యాచ్ టాస్ సమయంలో, ఆట ముగిశాక భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దాంతో.. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్(Andy Pycroft)పై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది పీసీబీ చీఫ్ నఖ్వీనే. అంతేకాదు పహల్గాం బాధితులకు, భారత సైన్యానికి విజయాన్ని అంకితమిచ్చిన సారథి సూర్యపై చర్యలు తీసుకోవాలని రిఫరీకి కంప్లై్ంట్ చేయడంలో నఖ్వీదే కీలక పాత్ర. సో.. భారత బోర్డు వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ వస్తున్న నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్‌ను స్వీకరించడం భారత కెప్టెన్‌కు ఒకింత ఇబ్బందికరమే. కానీ, ఏసీసీ చీఫ్ కాబట్టి ఇష్టంలేకపోయినా అతడికి షేక్‌హ్యాండ్ ఇవ్వాల్సి రావచ్చు. లీగ్ దశ నుంచి వరుస విజయాలతో ఫైనల్ చేరిన భారత్ సెప్టెంబర్ 28 ఆదివారం పాకిస్థాన్‌తో తుది సమరానికి సిద్ధమవుతోంది.