కరాచీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడేది లేదని తేల్చిచెప్పిన భారత్.. భద్రత విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే తమతో మాట్లాడాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మోహ్సిన్ నఖ్వీ అన్నారు. మంగళవారం కరాచీలోని గడాఫీ స్టేడియంలో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన ప్రతి దేశం ఇక్కడకు రావడానికి అంగీకారం తెలిపింది. ఎవరికీ ఏ ఇబ్బందీ లేదు. నేను ఇప్పటికీ ఒకటే చెబుతున్నా.. భారత్‌కు భద్రత విషయంలో ఏమైనా సమస్యలుంటే మాతో మాట్లాడాలి. మేం వాటిని పరిష్కరిస్తాం’ అని తెలిపారు. భారత్ పాకిస్థాన్‌కు ఎందుకు రావడం లేదో కారణాలను తెలుపుతూ తమకు వివరణ ఇవ్వాలని ఐసీసీని కోరామని, దీనిపై తమకు సానుకూల సమాధానం వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.