Pathum Nissanka : శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిశాంక(Pathum Nissanka) కెరీర్లో తొలి డబుల్ సెంచరీతో రికార్డులు నెలకొల్పిన విషయం తెలిసిందే. అఫ్గనిస్థాన్‌పై ఈ ద్వి శతకం బాదిన అతడు తాజాగా టీ20ల్లో 10వ హాఫ్ సెంచరీ బాదాడు. బుధవారం అఫ్గనిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో నిశాంక అనూహ్యంగా రిటైర్డ్ హర్ట్ (Retired Hurt)గా వెనుదిరిగాడు. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glen Maxwell) స్టయిల్లో సిక్సర్ బాదాడు. మోకాలిపై కూర్చొని మిడ్‌వికెట్ మీదుగా బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు.
ఆ తర్వాత నొప్పితో విలవిలలాడుతూ అమాంతం కిందపడిపోయాడు. దాంతో ఫీజియో పరుగున వచ్చి చెక్ చేశాడు. అయినా ఇబ్బందిగా ఉండడంతో నిశాంక రిటైర్ట్ హర్ట్‌గా మైదానం వీడాడు. అంతకుముందు 8 ఓవర్లోనే నిశాంక రెండు పరుగులు తీశాక ఇబ్బంది పడ్డాడు. అప్పుడు ఫిజియో వచ్చి చెక్ చేశాక ఇన్నింగ్స్ కంటిన్యూ చేశాడు.
మూడో టీ20లో రిటైర్ట్ హర్ట్ అయిన నిశాంక
అఫ్గనిస్థాన్ నిర్దేశించిన 209 పరుగుల ఛేదనలో నిశాంక 30 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. దాంతో, లంక అలవోకగా గెలుస్తుందని అనిపించింది. కానీ, అఫ్గన్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ లంకను ఒత్తిడిలోకి నెట్టారు. కుశాల్ మెండిస్ (65 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగినా లంక నిర్ణీత ఓవర్లలో 206 పరుగులకే పరిమితమైంది. దాంతో, వరుసగా టెస్టు, వన్డే సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన అఫ్గనిస్థాన్ ఓదార్పు విజయంతో లంక పర్యటనను ముగించింది. హాఫ్ సెంచరీతో అఫ్గన్ జట్టు భారీ స్కోర్‌కు బాటలు వేసిన ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(70)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.