Aishwarya Rai | స్వయంకృషితో ఎదిగిన ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌పై విమర్శలా..? : రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్
Aishwarya Rai : బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ గురువారం విరుచుకుపడింది.
Aishwarya Rai : బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ గురువారం విరుచుకుపడింది. స్వయం కృషితో విజయాలు సాధిస్తూ ఎదిగిన మహిళల పట్ల రాహుల్ చులకనభావాన్ని ఇది వెల్లడిస్తోందని, ఇది ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని బీజేపీ ఆక్షేపించింది. గత నెలలో అయోధ్యలో జరిగిన రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని రాహుల్ ఇటీవల ప్రస్తావించారు.
ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సెలబ్రిటీలు, బిలియనర్లు హాజరయ్యారని, అయితే ఓబీసీ, దళిత, గిరిజన వర్గాల నుంచి ఒక్కరిని కూడా అనుమతించలేదని రాహుల్ యూపీలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఆరోపించారు. దేశ జనాభాలో 73 శాతం ఉన్న ఈ వర్గాలను మోదీ సర్కార్ విస్మరించిందని విమర్శించారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ హాజరు కాగా, వారి వెంట ఐశ్వర్యా రాయ్ బచ్చన్ అయోధ్యకు రాలేదు.
రాహుల్ గాంధీ పదేపదే ఐశ్వర్యా రాయ్ పేరు ప్రస్తావిస్తూ దేశానికి గర్వకారణమైన ఐశ్వర్య రాయ్ ప్రతిష్టను మసకబారేలా చేస్తున్నారని బీజేపీ కర్నాటక రాష్ట్ర శాఖ ఆక్షేపించింది, ఏమీ సాధించని నాలుగో తరం వారసుడు ఇప్పుడు ఐశ్వర్యా రాయ్ గురించి నోటి దురుసు వ్యాఖ్యలు చేస్తున్నరాని, రాహుల్ కుటుంబం కంటే ఐశ్వర్యా రాయ్ దేశానికి మరింత వన్నె తెచ్చారని ఓ ప్రకటనలో పేర్కొంది. రాహుల్ గాంధీ పలు సందర్భాల్లో ఐశ్వర్యా రాయ్ పేరును ప్రస్తావించిన క్లిప్‌లను బీజేపీ షేర్ చేసింది. కర్నాటకకు చెందిన ఐశ్వర్యా రాయ్‌ను రాహుల్ ఇలా అవమానిస్తుంటే కర్నాటక సీఎం సిద్ధరామయ్య మౌనంగా ఎందుకున్నారని బీజేపీ ప్రశ్నించింది.
Read More :
WPL 2024 | ఆరంభ వేడుకలో షారుఖ్ స్పెషల్ షో.. డాన్స్‌లతో హోరెత్తించనున్న బాలీవుడ్ స్టార్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

