Brazil Footballer : బ్రెజిల్ మాజీ ఫుట్‌బాలర్ డానీ అల్వెస్(Dani Alves)కు ఊహించని షాక్ తగిలింది. లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన అతడికి గురువారం స్పెయిన్ కోర్టు జైలు శిక్షతో పాటు రూ. 13 కోట్లకు పైగా జరిమానా విధించింది. ‘అల్వెస్ సదరు మహిళ అనుమతి లేకుండానే ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. అందుకు తగిన ఆధారాలు ఉన్నాయి.
అందుకని అల్వెస్‌కు నాలుగున్నర ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ. 13.48 కోట్ల జరిమానా చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నాం’ అని బార్సిలోనాలోని కటలోనియా(Catalonia)లో ఉన్న అత్యున్యత న్యాయస్థానం తీర్పును వెలువరించింది.
రెండేండ్ల క్రితం బార్సిలోనా నైట్ క్లబ్లో ఒక పార్టీ జరిగింది. అక్కడ ఒక మహిళతో 40 ఏండ్ల డానీ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ విషయమై సదరు మహిళ డానీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమతి లేకుండా తన లోదుస్తుల్లో డానీ చేయి పెట్టాడని ఆమె పోలీసులకు తెలిపింది. అయితే.. డానీ మాత్రం తాను ఎటువంటి తప్పు చేయలేదని, ఆ మహిళ ఎవరో తనకు తెలియదని చెప్పాడు.
కోర్టు విచారణ గదిలో డానీ అల్వెస్
అంతేకాదు పరస్పర అంగీకారంతోనే తాను అలా ప్రవర్తించానని నమ్మబలికాడు. ఈ విషయంలో డానీకు అతడి భార్య జొయానా మద్దతుగా నిలిచింది. అయినా సరే.. స్పెయిన్ పోలీసులు జనవరి 20న అల్వెస్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతడు రిమాండ్‌లో ఉంటున్నాడు.
బ్రెజిల్ ఫార్వర్డ్ ప్లేయర్ అయిన డానీ ఖతర్‌లో జరిగిన ఫా వరల్డ్ కప్(FIFA World Cup) 2022 ఫిలో ఆడాడు. నాకౌట్ మ్యాచ్‌లో నెయ్మర్ గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరించాడు కూడా. అంతేకాదు బ్రెజిల్ వరల్డ్ కప్ జట్టులో పెద్ద వయస్కుడిగా అల్వెస్ రికార్డు నెలకొల్పాడు.