Shreyas Iyer : ఫామ్ లేమితో ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు దూరమైన భారత జట్టు స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కొత్త చిక్కుల్లో పడ్డాడు. వైజాగ్ టెస్టు (Vizag Test) అనంతరం వెన్ను నొప్పితో నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA) చేరిన అతడు ఫిట్‌గానే ఉన్నట్టు తేలింది. రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ఆడడకూడదనే తనకు వెన్ను నొప్పి ఉందని అయ్యర్ అబద్ధం చెప్పాడని ఎన్సీఏ అధికారులు బీసీసీఐకి లేఖ రాశారు. దాంతో, అయ్యర్‌పై బీసీసీఐ చర్యలు తీసుకొనే చాన్స్ ఉంది.
అయ్యర్‌కు కొత్త గాయం ఏమీ కాలేదు, అతడు ఫిట్‌గానే ఉన్నాడు. రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ఆడాల్సి వస్తుందనే అతడు వెన్ను నొప్పి సాకు చూపించాడు అని స్పోర్ట్స్ సైన్స్, మెడికల్ హెడ్ నితిన్ పటేల్ (Nitin Patel) బీసీసీఐకి రాసిన లేఖలో వెల్లడించాడు. ఫామ్ కోల్పోయిన భారత క్రికెటర్లు మళ్లీ జట్టులోకి రావాలంటే రంజీలు ఆడాల్సిందేనని బీసీసీఐ తేల్చి చెప్పింది.
శ్రేయస్ అయ్యర్

దాంతో, బరోడాతో ఫిబ్రవరి 12న జరిగే క్వార్టర్స్‌లో అయ్యర్ ఆడుతాడని ముంబై(Mumbai) అనుకుంది. కానీ, అయ్యర్ మాత్రం వెన్ను నొప్పితో బాధపడుతున్నాని, రంజీ మ్యాచ్ ఆడలేనని చెప్పాడు. ఇప్పుడు ఎన్సీఏ అయ్యర్ చెప్పిందంతా అబద్ధమని తేల్చింది. దాంతో, అతడిపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసకుంటుందా? లేదా? అనేది త్వరలోనే తెలియనుంది.

నిరుడు కూడా అయ్యర్ వెన్నునొప్పి కారణంగా పలు కీలక టోర్నీలకు దూరమయ్యాడు. శ్రీలంక, పాకిస్థాన్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఆసియా కప్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన అతడు.. మెరుపు ఇన్నింగ్స్‌లతో నాలుగో స్థానంలో తనకు తిరుగులేదని చాటుకున్నాడు. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్‌లోనూ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. దాంతో, టెస్టు జట్టులోనూ అతడు పాగా వేస్తాడని అనుకున్నరాంతా. కానీ, సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం భారీ స్కోర్లు కాదు కదా.. కనీసం హాఫ్ సెంచరీ కొట్టలేకపోయాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో నిరాశపరిచిన అయ్యర్ ఇంగ్లండ్ సిరీస్‌లోనూ తేలిపోయాడు. వరల్డ్ కప్ తర్వాత ఎనిమిది టెస్టు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా.. 31, 6, 0, 4 నాటౌట్, 35, 12, 27, 29 రన్స్ సాధించాడంతే. దాంతో, అతడిపై వేటు వేసి రంజీ వీరుడు సర్ఫరాజ్ ఖాన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.