Pat Cummins : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) రికార్డుల మోత మోగించాడు. లార్డ్స్ మైదానంలో సంచలన స్పెల్‌తో దక్షిణాఫ్రికా (South Africa) బ్యాటర్లను వణికించిన ప్యాటీ.. పలు రికార్డులు తన పేరిట రాసుకున్నాడు. లంచ్ తర్వాత డేవిడ్ బెడింగమ్(45) ను ఔట్ చేసిన ఆసీస్ సారథి ఐదో వికెట్‌తో చరిత్రకెక్కాడు.
ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఈ ఘనత సాధించిన ఐదో కెప్టెన్‌గా అతడు రికార్డుపుటల్లో చోటు సంపాదించాడు. అంతేకాదు సుదీర్ఘ ఫార్మాట్లో 300ల వికెట్ల క్లబ్లో చేరాడీ పేస్ గన్. తద్వారా ఈ మైలురాయికి చేరువైన ఎనిమిదో ఆసీస్ బౌలర్‌గా నిలిచాడు కమిన్స్. లార్డ్స్‌లో 5 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా కమిన్స్ రికార్డు సృష్టించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో సఫారీ బ్యాటర్లను క్రీజులో నిలవనీయని ఆసీస్ సారథి.. 6-28తో తమ జట్టును పోటీలోకి తెచ్చాడు. అతడి కంటేముందు ఈ మైదానంలో ఐదేసి వికెట్లు తీసిన వాళ్లు.. గబ్బీ అల్లెన్(ఇంగ్లండ్), బాబ్ విల్స్(ఇంగ్లండ్), డానియల్ వెటోరీ (న్యూజిలాండ్).
Pat with the ball is always a treat to watch 🔥
Pat Cummins | #WTC25 | #SAvAUS pic.twitter.com/141wdqD39m
— SunRisers Hyderabad (@SunRisers) June 12, 2025
భారత్‌పై 1936లో అల్లెన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో విజృంభించాడు. తొలుత 5-35తో రాణించిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో 5-43తో టీమిండియాను దెబ్బకొట్టాడు. 1982లో బాబ్ కూడా భారత్‌పైనే ఐదు వికెట్ల ప్రదర్శన కనబరిచాడు. 101 పరుగులకే 6 వికెట్లు తీశాడీ వెటరన్. న్యూజిలాండ్ స్పిన్నర్ వెటోరీ 2008లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 5-69తో ఆతిథ్య జట్టు నడ్డివిరిచాడీ కివీ బౌలర్.
సుదీర్ఘ ఫార్మాట్లో కమిన్స్ 5 వికెట్ల ప్రదర్శన చేయడం ఇది తొమ్మిదోసారి. దాంతో, సారథిగా అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడీ పేసర్. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్(12 పర్యాయాలు) అగ్ర స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిచీ బెనౌడ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ 8 పర్యాయాలు ఐదేసి వికెట్ల ప్రదర్శనతో నాలుగో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ దిగ్గజం కౌట్నీ వాల్ష్, జేసన్ హోల్డర్లు ఏడుసార్లు టెస్టుల్లో 5 వికెట్ల హాల్‌తో మెరిశారు.
Pat Cummins, the eighth Australian to take 300 Test wickets 🙌 pic.twitter.com/lsfpVWqO7V
— ESPNcricinfo (@ESPNcricinfo) June 12, 2025