WTC Final : లార్డ్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా (Australia) పట్టుబిగిస్తోంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (6-28) సంచలన బౌలింగ్‌తో దక్షిణాఫ్రికా నడ్డి విరిచాడు. అతడి విజృంభణతో 121-5లో లంచ్‌కు వెళ్లిన సఫారీ జట్టు ఆ తర్వాత కాసేపటికే కుప్పకూలింది.
ఒకే ఓవర్లో ఔట్ చేసిన కమిన్స్ ఆసీస్‌ను పోటీలోకి తెచ్చాడు. కాసేపటికే కేశవ్ మహరాజ్(7) రనౌట్ కాగా.. రబడ (1) గాల్లోకి లేపిన బంతిన బౌండరీ వద్ద వెబ్‌స్టర్ అందుకోవడంతో బవుమా టీమ్ 138కే ఆలౌటయ్యింది. దాంతో, తొలి ఇన్నింగ్స్‌లో కంగారూలకు 74 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
Pat Cummins’ spirited bowling effort wraps up the Proteas innings, handing Australia a healthy lead 🙌#SAvAUS
Follow LIVE ➡️ https://t.co/LgFXTd0RHt pic.twitter.com/w5fjZN3QAR
— ICC (@ICC) June 12, 2025
ఐసీసీ ఈవెంట్లలో ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం చాలా కష్టం. ఈ మాట నిజమని ఆ జట్టు చాలాసార్లు నిరూపించింది కూడా. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ ఆసీస్ గెలుపు దిశగా సాగుతోంది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఫైనల్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్(6-28) నిప్పులు చెరిగాడు. స్వింగ్, బౌన్స్‌కు అనుకూలించిన పిచ్ మీద లైన్ అండ్ లెగ్త్‌తో చెలరేగిపోయాడు. ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికాకు షాకిస్తూ తెంబ బవుమా(36)ను పెవిలియన్ పంపాడు ప్యాటీ. దాంతో, సఫారీ టీమ్ 12-1-5తో లంచ్‌కు వెళ్లింది.
లంచ్ తర్వాత తన పేస్ పవర్ చూపించిన కమిన్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. కైలీ వెర్రినే(13)ను ఎల్బీగా వెనక్కి పంపిన అతడు.. ఆ తర్వాత మార్కో యాన్సెన్(0)ను బౌల్డ్ చేసి దక్షిణాఫ్రికాను ఆలౌట్ అంచున నిలిపాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా క్రీజులో పాతుకుపోయిన డేవిగ్ బెడింగమ్(45) జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
FIVE-WICKET HAUL FOR PAT CUMMINS! 🔥
Australia’s captain is leading by example on the biggest stage 🫡#SAvAUS #WTCFinal pic.twitter.com/ClRkF4JVUs
— ESPNcricinfo (@ESPNcricinfo) June 12, 2025
నిన్నటి నుంచి విసిగిస్తున్న అతడిని ఔట్ చేయడం ద్వారా కమిన్స్ ఐదో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా లార్డ్స్ మైదానంలో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన మూడో కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు కమిన్స్. హెడ్ విసిరిన త్రోకు కేశవ్ మహరాజ్(7) రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కమిన్స్ బౌలింగ్‌లో ఇబ్బంది పడిన కగిసో రబడ(1) పెద్ద షాట్ ఆడి బౌండరీ వద్ద వెబ్‌స్టర్ చేతికి చిక్కాడు. అంతే.. 138 పరుగులకే సఫారీ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే కట్టడి చేసిన ఆసీస్ 74 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది. రబడను ఔట్ చేయడం ద్వారా కమిన్స్ టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్లో చేరాడు. ఈ ఘనత సాధించిన 8వ ఆసీస్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడీ స్పీడ్‌స్టర్.