తిరువనంతపురం: పోలీస్ స్టేషన్‌లోని మహిళా కానిస్టేబుల్స్ డ్రెస్సింగ్ ఏరియాలో రహస్య కెమెరాను ఒక పోలీస్ ఉంచాడు. రహస్యంగా వీడియోలు రికార్డ్ చేశాడు. ఒక మహిళా కానిస్టేబుల్ మొబైల్ ఫోన్‌కు ఆమె ఫొటో పంపాడు. ఆమె ఫిర్యాదుతో ఆ పోలీస్‌ను అరెస్ట్ చేశారు. (cop caught filming women constables) కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వండిపెరియార్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్‌కు ఆమె దుస్తులు మార్చుకున్న అభ్యంతరకర ఫొటో మొబైల్ ఫోన్‌కు వచ్చింది.
కాగా, ఆ మహిళా పోలీస్ కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమైంది. మహిళా సెల్‌ను సంప్రదించడంతో పాటు సైబర్ వింగ్‌కు సమాచారం ఇచ్చింది. పోలీస్ కానిస్టేబుల్ వైశాకన్ నుంచి ఆ ఫొటో వచ్చినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో అతడ్ని అరెస్ట్ చేసి ఆ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మహిళా కానిస్టేబుల్స్ డ్రెస్సింగ్ ఏరియాలో రహస్య కెమెరా ఉంచి వీడియోలు, ఫొటోలు రికార్డ్ చేసినట్లు గుర్తించారు. ఆ పోలీస్‌పై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
Also Read:
బీఎస్ఎఫ్ జవాన్లకు మురికి రైలు ఏర్పాటుపై వివాదం.. నలుగురు అధికారులు సస్పెండ్
త్రిపురలో ‘ట్రయాంగిల్ లవ్ మర్డర్’.. ఐస్‌క్రీమ్ ఫ్రీజర్‌లో వ్యక్తి మృతదేహం
90 డిగ్రీల మలుపుతో వంతెన నిర్మాణంపై విమర్శలు.. డిజైన్‌ను సమర్థించిన అధికారులు