Parthiv Patel | టీ20 వరల్డ్ కప్‌లో జడ్డూ వద్దు.. ఎందుకంటే..?
Parthiv Patel : సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్‌ను చేజార్చకున్న భారత జట్టు(Team India) మరో ఐసీసీ ట్రోఫీ లక్ష్యంగా సిద్దమవుతోంది. అఫ్గనిస్థాన్(Afghanistan)తో పొట్టి సిరీస్‌తో టీ20 ప్రపంచ కప్ సన్నాహకాలు ప్రారంభించిన టీమిండియా అన్ని విభాగాలపై...
Parthiv Patel : సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్‌ను చేజార్చకున్న భారత జట్టు(Team India) మరో ఐసీసీ ట్రోఫీ లక్ష్యంగా సిద్దమవుతోంది. అఫ్గనిస్థాన్(Afghanistan)తో పొట్టి సిరీస్‌తో టీ20 ప్రపంచ కప్ సన్నాహకాలు ప్రారంభించిన టీమిండియా అన్ని విభాగాలపై దృష్టి పెట్టింది. దాంతో, ప్రపంచకప్ స్క్వాడ్‌లో ఎవరెవరు ఉంటారు? అనే చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్(Parthiv Patel) షాకింగ్ కామెంట్స్ చేశాడు.
మెగా టోర్నీలో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) బదులు అక్షర్ పటేల్(Axar Patel)ను ఆడించాలని సూచించాడు. ‘అక్షర్ పటేల్ కచ్చితత్వంతో బంతులు వేస్తాడు. అతడి ఓవర్లో భారీ షాట్లు ఆడాలంటే అతడి కాళ్లను గమనించాలి. కానీ అది కూడా అసాధ్యమే. ఎందుకంటే.. అక్షర్ వేగంగా బంతులు వేస్తాడు. పవర్ ప్లే, మిడిల్ ఓవర్లలో అతడు చక్కగా బౌలింగ్ చేయగలడు’ అని పార్థీవ్ జియో సినిమాతో అన్నాడు. అంతేకాదు జడేజా కంటే అక్షర్ ఏవిధంగా బెటర్ అనేదానిపై కూడా ఈ మాజీ క్రికెటర్ మాట్లాడాడు.
అక్షర్ పటేల్, పార్థీవ్ పటేల్

‘జడేజా కంటే అక్షర్ జట్టుకు బ్యాలెన్స్ తెస్తాడు. అతడు పవర్ ప్లేలో చక్కగా బౌలింగ్ చేస్తాడు. అందుకనే అతడు టీ20ల్లో బెటర్ క్రికెటర్. అందుకనే నా చాయిస్ అక్షర్’ అని పార్దీవ్ చెప్పుకొచ్చాడు. ఆసియా కప్‌లో గాయడిన అక్షర్.. వరల్డ్ కప్ అనంతరం జట్టులోకి వచ్చాడు.
రవీంద్ర జడేజా

తాజాగా అఫ్గనిస్థాన్‌తో ఇండోర్ జరిగిన రెండో టీ20లో అక్షర్ అదరగొట్టాడు. 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ప్రమాదకరమైన గుల్బదిన్, ఇబ్రహీం జర్డాన్ వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే.. జడేజా ఐదు వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. దాంతో, అనుభవజ్ఞుడైన జడ్డూకే వరల్డ్ కప్ స్క్వాడ్‌లో చోటు దక్కే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ జూన్ 1న మొదలవ్వనుంది. ఈసారి పపువా న్యూగినియా, నమీబియా వంటి జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి.
ఇవి కూడా చదవండి
- Ben Duckett | భారత పిచ్‌లపై ఆ షాటే నా ఆయుధం : ఇంగ్లండ్ ఓపెనర్
- Shreyas Iyer: డాట్ బాల్స్ అంటే నాకు నచ్చవు.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అలా ఆడతా అంటున్న అయ్యర్
- AP PCC Chief YS Sharmila | ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల నియామకం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

