Ben Duckett | భారత పిచ్‌లపై ఆ షాటే నా ఆయుధం : ఇంగ్లండ్ ఓపెనర్
Ben Duckett : భారత జట్టుతో టెస్ట్ సిరీస్‌కు ఇంగ్లండ్(Engaland) అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. నిరుడు సొంతగడ్డపై యాషెస్ సిరీస్(Ashes Series) సమం చేసిన బెన్ స్టోక్స్ బృందం టీమిండియా సవాల్‌కు సిద్ధమవుతోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC 2023-25)లో కీలకమైన ఈ సిరీస్‌కు...
Ben Duckett : భారత జట్టుతో టెస్ట్ సిరీస్‌కు ఇంగ్లండ్(Engaland) అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. నిరుడు సొంతగడ్డపై యాషెస్ సిరీస్(Ashes Series) సమం చేసిన బెన్ స్టోక్స్ బృందం టీమిండియా సవాల్‌కు సిద్ధమవుతోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC 2023-25)లో కీలకమైన ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(Ben Duckett) భారత బౌలర్లకు హెచ్చరికలు పంపాడు. ఇండియాలో పరిస్థితులు ఎలా ఉన్నా సరే తమ జట్టు దూకుడులో ఏమాత్రం తేడా ఉండదని అన్నాడు.
స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ పొడ్‌కాస్ట్‌లో మాట్లాడిన డకెట్.. స్నిన్ ఉచ్చులో పడేయాలని చూస్తే తాను రివర్స్ స్వీప్‌ను డిఫెన్స్‌గా మార్చుకుంటానని తెలిపాడు. ‘నా అమ్ములపొదిలో పది స్వీప్ షాట్స్ ఉన్నాయి. భారత క్యూరేటర్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు స్పిన్ పిచ్‌లు రూపొందిస్తే.. నేను స్వీప్ షాట్‌నే ఆయుధంగా ప్రయోగిస్తా. కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ అండగా ఉండగా మాకు అలవాటైన రీతిలో చెలరేగి పోతాం’ అని డకెట్ వెల్లడించాడు.
బెన్ డకెట్

భారత పర్యటనకు 2016లో వచ్చిన డకెట్ దారుణంగా విఫలయమ్యాడు. దాంతో, తొలి రెండు టెస్టులకే అతడిపై వేటు పడింది. అయితే.. 2022లో తిరిగి జట్టులోకి వచ్చాక డకెట్ ఆటే మారిపోయింది. స్వదేశంలో, పాకిస్థాన్ పర్యటనలో సెంచరీలతో చెలరేగాడు. నిరుడు ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లోనూ ఈ ఓపెనర్ బాజ్‌బాల్ ఆటతో అలరించాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య జనవరి 25న హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో తొలి టెస్టు జరగునుంది.

సఫారీ గడ్డపై సిరీస్ సమం చేసిన భారత్ సొంతగడ్డపై సిరీస్ విజయంపై కన్నేసింది. నిరుడు ఆస్ట్రేలియాను చిత్తు చేసిన రోహిత్ సేన ఇంగ్లండ్ పని పట్టేందుకు సిద్ధమవుతోంది. కానీ, ఇంగ్లీష్ జట్టును తేలిగ్గా తీసుకోలేం. ఎందుకంటే.. 2012లో ఇంగ్లండ్ 2-1తో సిరీస్ కొల్లగొట్టింది. అయితే.. ఇప్పుడు టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. టాపార్డర్‌లో కోహ్లీ, రోహిత్, యశస్వీ, అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. స్పిన్ ఉచ్చు బిగించేందుకు జడేజా, అశ్విన్ ఉండగా.. పేసర్లు బుమ్రా, సిరాజ్, ముకేశ్ అదరగొడుతున్నారు.
ఇవి కూడా చదవండి
- Supreme Court | చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై భిన్నాభిప్రాయాలు.. నిర్ణయం సీజేఐకు బదిలీ
- Pat Cummins: ఏడాదంతా అవార్డులే.. 2023ను అలా ముగించిన ఆసీస్ సారథి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Komatireddy | కొడంగల్‌కు ఫుల్ నిధులు..మునుగోడుకు నిల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
House Slab Collapses | నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలి కార్మికుడు మృతి.. నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

