Lakshyasen | పారిస్: బ్యాడ్మింటన్‌లో స్వర్ణం లేదా రజతం గెలిచి చరిత్ర సృష్టించే అవకాశాన్ని భారత యువ షట్లర్ లక్ష్యసేన్ చేజేతులా జారవిడుచుకున్నాడు. ఒలింపిక్స్‌లో పురుషుల సెమీస్‌కు చేరిన తొలి భారత షట్లర్‌గా నిలిచిన లక్ష్యసేన్.. 20-22, 14-21తో విక్టర్ అక్సెల్సెన్ (డెన్నార్క్) చేతిలో ఓడాడు.
ఆదివారం 54 నిమిషాల్లోనే ముగిసిన సెమీస్ పోరులో తొలి సెట్‌ను త్రుటిలో కోల్పోయిన అతడు.. రెండో సెట్లో పుంజుకున్నా ప్రత్యర్థి దూకుడుతో పరాజయం వైపు నిలిచాడు. సెమీస్‌లో ఓడటంతో అతడు సోమవారం జరిగే కాంస్య పోరులో మలేషియా షట్లర్ లీ జి జియాతో అమీతుమీ తేల్చుకోనున్నాడు.