Paralympics Medalists : పారాలింపిక్స్‌లో పతకాలతో మెరిసిన షట్లర్లకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. పారిస్‌లో భారతావని గర్వపడేలా చేసిన పారా షట్లర్లు నిత్య శ్రీ శివన్(Nithya Sri Sivan), తులసిమతి మురుగేశన్(Tulasimathi Murugesan), మనీష రామదాసు(Manisha Ramadasu)లు గురువారం స్వరాష్ట్రమైన చెన్నైలో అడుగుపెట్టారు. విమానాశ్రయంలో దిగగానే ఈముగ్గురికి చప్పట్లతో అభినందనలు తెలిపి.. అనంతరం పూల దండలతో స్వాగతించారు.
సొంతగడ్డపై అపూర్వ స్వాగతానికి ఫిదా అయిన షట్లర్లు సంతోషం పట్టేలేకపోయారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పారిలింపిక్స్ మహిళల సింగిల్స్‌లో మనీష రామదాసు కాంస్యంతో చరిత్ర సృష్టించింది. పతకం సాధించిన తొలి పారా షట్లర్‌గా రికార్డు నెలకొల్పింది.
Paralympic medallists Nithya Sre Sivan, Thulasimathi Murugesan and Manisha Ramadass received a beautiful welcome at Chennai Airport 👏
These smiles on the face of our Pata Athletes 🫶pic.twitter.com/QXN4wzy61l
— The Khel India (@TheKhelIndia) September 4, 2024
సెమీస్‌లో తులసీమతి చేతిలో కంగుతిన్న మనీష.. కాంస్య పోరులో డెన్మార్క్ షట్లర్ క్యాథరిన్ రొసెన్గ్రెన్ను 21-12, 21-8తో ఓడించింది. తద్వారా 19 ఏండ్ల మనీష బ్యాడ్మింటన్‌లో తొలి పతకం గెలిచిన పారా షట్లర్‌గా రికార్డు సాధించింది. ఆ కాసేపటికే తులసీమతి వెండితో మెరిసింది. చైనాకు చెందిన యాంగ్ గ్జిక్జియా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఇక నిత్య శ్రీ సివన్ మహిళల ఎస్‌హెచ్6 విభాగంలో కాంస్యంతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.