Fish Venkat | ఫిష్ వెంకట్‌కు ఆర్థిక సాయం అందించిన ప్రముఖ నిర్మాత
Fish Venkat | టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు చెడిపోయి నడవలేని దయనీయ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ప్రముఖ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫిష్ వెంకట్‌పై చేసిన ఓ వీడియో వలన ఈ విషయం బయటకు వచ్చింది.
Fish Venkat | టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు చెడిపోయి నడవలేని దయనీయ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ప్రముఖ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫిష్ వెంకట్‌పై చేసిన ఓ వీడియో వలన ఈ విషయం బయటకు వచ్చింది. తన రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉండాల్సి వస్తోందని, ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేసుకుంటున్నానని తన పరిస్థితి గురించి చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అయితే వెంకట్ పరిస్థితి తెలుసుకున్న ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు (Chadalavada Srinivasa Rao) ఫిష్ వెంకట్‌కు వైద్య, ఆర్థిక సహాయార్థం లక్ష రూపాయల సాయం అందించారు. చదలవాడ శ్రీనివాసరావు తరఫున ఆర్థిక సాయం తాలూకు చెక్కును టీఎఫ్‌పీసీ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, టీఎఫ్ పీసీ ట్రెజరర్, నిర్మాత రామసత్యనారాయణ, దర్శకుడు కె.అజయ్ కుమార్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ ఫిష్ వెంకట్‌కు అందించారు.
ఈ సందర్భంగా ఫిష్ వెంకట్ మాట్లాడుతూ.. నా కష్టాన్ని తెలుసుకుని అడగకుండానే లక్ష రూపాయలు సహాయం అందించిన చదలవాడ శ్రీనివాసరావుకి ధన్యవాదాలు. ఆయన చేసిన ఈ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నేను నా కుటుంబం ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఆ దేవుడి ఆశీస్సులు ఆయన పైన ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఫిష్ వెంకట్ తెలిపాడు.
Also read..
- Vladimir Putin: ఉక్రెయిన్‌తో యుద్ధం.. భారత్‌తో టచ్‌లో ఉన్నాం: వ్లాదిమిర్ పుతిన్
- Jagadish Reddy | అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతులను అడ్డుకోలేరు : జగదీష్ రెడ్డి
- Salaar | మరో భాషలో ప్రభాస్ సలార్.. ఓటీటీ ప్లాట్‌ఫాం ఇదే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

