Salaar | ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే డైరెక్టర్లు గ్లోబల్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రభాస్ నటించిన బాహుబలి ప్రాంఛైజీ గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ తర్వాత విదేశాల్లో కూడా ప్రభాస్ సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ జాబితాలో ఇప్పటికే యాక్షన్ థ్రిల్లర్ సలార్ (Salaar) చేరిపోయింది.
కేజీఎఫ్ ఫేం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహించిన ప్రాంచైజీ Salaar Part-1 Ceasefire గతేడాది డిసెంబర్ 22న థియేటర్లలో వసూళ్లు వర్షం కురిపించింది. సలార్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో కూడా తన రేంజ్ ఏంటో చూపించింది. చాలా రోజులకు సలార్‌కు సంబంధించిన మరో క్రేజీ వార్త తెరపైకి వచ్చింది. సలార్ 2024 జులై 5న జపనీస్ భాషలో విడుదలైందని తెలిసిందే. ఈ చిత్రం జపనీస్ వెర్షన్ ఓటీటీ అప్డేట్ వచ్చింది. సలార్ జపనీస్ వెర్షన్ Hulu Japan లో స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రభాస్ ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ సీక్వెల్ సలార్ 2లో నటిస్తున్నాడని తెలిసిందే. సలార్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. జగపతి బాబు, పృథ్విరాజ్ సుకుమారన్ , బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ తెరకెక్కించారు.
/
話題のインド映画が早くもHuluに登場!
最速レンタル独占配信開始🔥
\#プラバース 主演
|◤🪓映画『SALAAR/#サラール』🪓◢|視聴▶︎▶︎https://t.co/s4SZg5ZHw2
神話を彷彿とさせる壮絶なヒーローアクション叙事詩👊⁾⁾
『バーフバリ 王の凱旋』『RRR』に次ぐ大ヒット作をお見逃しなく!— Hulu Japan (@hulu_japan) September 5, 2024
Thandel | జోష్ టు తండేల్.. నాగచైతన్య జర్నీకి ఎన్నేండ్లో తెలుసా..?
Samantha | మూవీ షూటింగ్లో గాయపడ్డ సమంత..! గాయాలు కాకుండా యాక్షన్ స్టార్‌ను కాగలనా? అంటూ పోస్ట్..!
Meenakshi Chaudhary | ది గోట్ కథకు నా పాత్ర చాలా ముఖ్యం : మీనాక్షి చౌదరి