POCO M8 5G : చైనాకు చెందిన షావోమీ కో బ్రాండ్ పోకో నుంచి తాజాగా పోకో M8 అనే 5జీ డ్యుయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది. ఇది బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్. ఇది కార్బన్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ, ఫ్రాస్ట్ సిల్వర్ అనే మూడు రంగుల్లో, మూడు వేరియెంట్లలో లభిస్తుంది. 6GB+128GB, 8GB+128GB, 8GB+256GB అనే వేరియెంట్లలో దొరుకుతుంది.
ప్రధాన ఫీచర్లివి.. 6.77 అంగుళాల 3D కర్వుడ్ డిస్ ప్లే, 3,200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, ఆండ్రాయిడ్ 15 బేస్డ్ హైపర్ ఓఎస్ 2.0, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 6 సిరీస్ చిప్ సెట్, ఐపీ65+, ఐపీ 66 రేటింగ్, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 68.7 బిలియన్ కలర్స్ సపోర్ట్, వెట్ టచ్ 2.0, వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ లైట్ ఫ్యూజన్ సెన్సర్, 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4కే వీడియో రికార్డింగ్ ఫీచర్, 5,520 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లున్నాయి.
నాలుగేళ్లపాటు ఓఎస్ అప్డేట్స్, ఆరేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. వీటి ధరలు వరుసగా రూ.18,999, రూ.19,999, రూ.21,999గా ఉన్నాయి. వివిధ కార్డులపై రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. జనవరి 13 నుంచి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది. మొదటి 12 గంటల్లో కొనుగోలు చేసిన వారికి మరింత తక్కువ ధరకే ఫోన్ లభిస్తుంది.