హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఇవాళ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పలువురు నేతలు కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ స్వయంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ రంజిత్, వార్డు మెంబర్స్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు.
ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, రంగినేని అభిలాష్ రావు, అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఆంజనేయ గౌడ్, ఇంతియాజ్ అలీ, కురువ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి చేరికలు
కొల్లాపూర్ నియోజకవర్గం, చిన్నంబావి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ రంజిత్, వార్డు మెంబర్స్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో… pic.twitter.com/E2hAa9ZGQw
— BRS Party (@BRSparty) January 8, 2026