Unofficial 1st Test : తొలి అనధికారిక టెస్టులో భారత ఏ జట్టు జయభేరి మోగించింది. పునరాగమనం మ్యాచలో చెలరేగిన రిషభ్ పంత్ (90) దక్షిణాఫ్రికా ఏ బౌలర్లను ఉతికేసిన సెంచరీ చేజార్చుకున్నా జట్టు విజయంలో కీలకమయ్యాడు. పంత్ వెనుదిరిగాక మానవ్ సుతార్(20 నాటౌట్), అన్షుల్ కంభోజ్(37 నాటౌట్)లు పట్టుదలగా ఆడి జట్టుకు 3 వికెట్ల విజయాన్ని అందించారు. సూపర్ విక్టరీతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
బెంగళూరులోని సీఈవో మైదానంలో భారత ఏ జట్టు గొప్పగా పుంజుకొని దక్షిణాఫ్రికా ఏకు చెక్ పెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన కెప్టెన్ రిషభ్ పంత్(90) .. రెండో ఇన్నింగ్స్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించిన పంత్ తన సూపర్ ఫిఫ్టీతో లక్ష్యాన్ని కరిగించాడు. చివరి రోజు 156 పరుగులు అవసరమైన వేళ సెంచరీ చేజార్చుకున్నాడు. ఆయుష్ బదొని (34) ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. ఆ తర్వాత మానవ్ సుతార్(20 నాటౌట్), అన్షుల్ కంభోజ్(37 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా జట్టును గెలిపించారు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 8 వికెట్లు తీసిన తనుష్ కొతియాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. రెండో అనధికారిక టెస్టు నవంబర్ 6న జరుగనుంది.
3 months away from the game makes you appreciate every moment a little more.
Felt amazing to be back out there again and even better to start with a win 🙌
Grateful to everyone who’s helped me along the way. Onto the next one. #RP17 pic.twitter.com/3N4J2Sf1ty— Rishabh Pant (@RishabhPant17) November 2, 2025
తొలి ఇన్నింగ్స్‌లో 70 పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకున్న టీమిండియా.. మూడో రోజు ప్రత్యర్థిని కుప్పలకూల్చింది. ఓవర్‌నైట్ స్కోర్ 30/0తో ఇన్నింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఏ జట్టుకు తనుష్ కొతియాన్ (4-26), అన్షుల్ కంభోజ్(3-39)లు షాకిచ్చారు. వీరిద్దరూ హడలెత్తించగా 199కే కుప్పకూలింది. ఓపెన్ లెసెగో సెనొక్వెనె(37), జుబయిర్ హంజా(37)లు టాప్ స్కోరర్లు. కాసేపటికి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 32కే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్(90) తనదైన స్టయిల్లో రెచ్చిపోయి జట్టు విజయానికి బాటలు వేశాడు.
India A defeated South Africa A by 3 wickets in the first multi-day match at the BCCI CoE. 🇮🇳
Tanush Kotian won the Player of the Match award for his all-round performance. 👏#Cricket #IndiaA #BCCI #Sportskeeda pic.twitter.com/35pM7trNWS
— Sportskeeda (@Sportskeeda) November 2, 2025
తొలి ఇన్నింగ్స్‌లో తనుష్ కొతియాన్(4-83), గుర్నూర్ బ్రార్(2-45)ల విజృంభణతో సఫారీ టీమ్ 309కి ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సాయి సుదర్శన్(32), ఆయుశ్ మాత్రే(65)లు శుభారంభం ఇచ్చినా మిగతావాళ్లు స్వదినియోగం
చేసుకోలేకపోయారు. పేసర్లను దీటగా ఎదుర్కొన్న ఓపెనర్లు తొలి వికెట్‌కు 91 రన్స్ జోడించారు. కానీ, సఫారీ స్పిన్నర్ సుబ్రయేన్(5-61) కీలక వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. గాయం నుంచి కోలుకొని కెప్టెన్‌గా ఆడుతున్న రిషభ్ పంత్(17) స్వల్ప స్కోర్‌కే సెలే ఓవర్లో ఔటయ్యాడు. ఆ తర్వాత ఆయుశ్ బదొని(38).. తనుష్ కొతియాన్(13)లు కుదురుకున్నా పెద్ద స్కోర్ చేయలేకపోయారు. దాంతో.. 234కే టీమిండియా ఆలౌటయ్యింది.