BCCI : వచ్చే వన్డే ప్రపంచకప్ సన్నద్ధతలో భాగంగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. రెగ్యులర్ సారథి శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలో 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. ప్లీహం గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) వైస్ కెప్టెన్‌గా ఎంపికవ్వగా.. రెండో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌కు చోటు దక్కింది. అయితే.. దేశవాళీలో వికెట్ల వేట కొనసాగిస్తున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీని అజిత్ అగార్కర్ బృందం మరోసారి పక్కన పెట్టేసింది.
స్వదేశంలో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా కొత్త ఏడాది తొలి సిరీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. కివీస్‌తో జనవరి 11 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. దాంతో.. ఈ సిరీస్ కోసం శనివారం సెలెక్టర్లు శుభ్‌మన్ గిల్ సారథిగా స్క్వాడ్‌ను ప్రకటించారు. ఆస్ట్రేలియా, సఫారీలపై .. దేశవాళీలోనూ దంచేసిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను కొనసాగించిన సెలెక్టర్లు.. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్‌ను తిరిగి తీసుకున్నారు. రెండో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌ను ఎంపిక చేశారు.
🚨 News 🚨
India’s squad for @IDFCFIRSTBank ODI series against New Zealand announced.
Details ▶️ https://t.co/Qpn22XBAPq#TeamIndia | #INDvNZ pic.twitter.com/8Qp2WXPS5P
— BCCI (@BCCI) January 3, 2026
భారత స్క్వాడ్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(వైస్ కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, సిరాజ్, హర్షిత్ రానా, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీశ్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్.
విశాఖ వన్డేలో శతకం బాదిన యశస్వీ జైస్వాల్‌కు బ్యాకప్ ఓపెనర్‌గా చోటు దక్కింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో సెంచరీతో మెరిసిన ఇషాన్ కిషన్, వికెట్లతో చెలరేగిన మహ్మద్ షమీలను మాత్రం పక్కన పెట్టేశారు. కివీస్‌తో పొట్టి సిరీస్ కూడా ఉన్నందున సీనియర్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. పేస్ బౌలింగ్ భారాన్ని ప్రసిధ్, హర్షి్త్, అర్ష్‌దీప్ సింగ్‌లు మోయనుండగా.. స్పిన్నర్లుగా కుల్దీప్, సుందర్, జడేజాలు స్క్వాడ్‌లోకి వచ్చారు. భారత్, న్యూజిలాండ్ మధ్య జనవరి 11న వడోదరలో తొలి వన్డే, 14న రాజ్‌కోట్‌లో రెండో వన్డే, జనవరి 16న ఇండోర్‌లో మూడో వన్డే జరుగుతాయి. అనంతరం నాగ్‌పూర్ వేదికగా జనవరి 21 నుంచి టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది.